డేటా చోరీ ఇపుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం రేపుతోంది. ప్రజల వద్ద నుంచి సేకరించిన డేటా అంతా ప్రైవేట్ సంస్థ చేతిలోకి వెళ్ళిపోయిందన్న దాని మీద ఇటు జనంలో పూర్తిగా  అభద్రతా భావం నెలకొంది. అటు దీని మీద రాజకీయంగా దుమారం రేగుతోంది.  పరస్పర ఆరోపణలతో వాతావరణం వేడెక్కుతోంది.


ఆ రెండింటి మీద కన్ను :


ఇక హైదరాబాద్లో ఐటి  గ్రిడ్ మీద దాడి చేసి డేటా చోరీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణా పోలీసులు ఈ మొత్తం డేటాను భద్రపరచారని భావిస్తున్న అమెజాన్, గూగూల్ సంస్థలకు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్ల మొత్తం వివరాలు చెబుతామని ఆ సంస్థలు పేర్కొన్న నేపధ్యంలో కధ మరో కొత్త మలుపు తిరగనుంది. ఆ రెండు సంస్థలు ఇచ్చే వివరాలు ఏంటన్న దానిపైన సర్వత్రా ఉథ్కంఠ నెలకొంది. అదే సమయంలో ఆ డేటా వివరాలను బట్టి తెలంగాణా పోలీసుల దర్యాప్తు మరో అడుగు ముందు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.


కీలక సమాచారం :


ఇక నిన్న మొత్తం రోజంతా ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేసిన తెలంగాణా పోలీసులు అక్కడ కీలకమైన సమాచారం సేకరించారని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే ఇటు అమెజాన్, గూగుల్ సమాచారం, అటు పోలీసుల దర్యాప్తు వివరాలు కలుపుకుని సెన్సేషనల్ న్యూస్ బయటకు వస్తుందని అంటున్నారు. ఆ విధంగా చూసుకుంటే షాకింగ్ పరిణామాలే చోటుచేసుకోవచ్చునని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: