రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అపర కుభేరుడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఆయన… 12 వేల కోట్లతో ఇల్లు కట్టినా.. 25 కోట్ల ఖర్చుపెట్టి కారు కొనుక్కున్నా అతనికె చెల్లుతుంది. ఆ మాటకొస్తే కార్ల ప్రియుడైన అంబానీ దాదాపు 160 లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఇంట్లో ఒక ఫ్లోరు, కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేసారంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికేం ఉంటుంది.  తాజాగా భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఫోర్బ్స్  అత్యంత సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి చేరారు. 2019 జాబితాలో ఆయన ఒక్కసారిగా 6 స్థానాలు ఎగబాకడం విశేషం. 
Bezos vs. Ambani is the bout that had to happen
2014లో, ఫోర్బ్స్ జాబితాలో అంబానీ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా 36వ స్థానంలో నిలిచారు. 2013లో భారతదేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తిగా గుర్తించబడ్డారు. అదే సంవత్సరం ఆసియాలో రెండవ అత్యంత సంపన్నునిగా నిలిచారు ముఖేష్. ఫోర్బ్స్ అంతర్జాతీయ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు మరోసారి అగ్రస్థానం దక్కింది. ముఖేష్ అంబానీ ఆస్తి విలువను ఫోర్బ్స్ 50 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. 2018లో అంబానీ సంపద 40.1 బిలియన్ డాలర్లుగా తెలిపింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ సంపద 131 బిలియన్ డాలర్లని పేర్కొంది ఫోర్బ్స్ మ్యాగజైన్.

ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా 122వ స్థానం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 167వ స్థానం, ఎయిర్ టెల్ యజమాని సునీల్ మిట్టల్ 244వ స్థానం దక్కించుకున్నారు.  ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కింగ్ వారెన్ బఫెట్ తదితరులు బెజోస్ కు దిగువన ఉన్నారు.  ఇక, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ మూడు స్థానాలు దిగజారి 8వ స్థానంలో నిలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: