చంద్రబాబు ఏపీకి సీఎం. ఆయన మాటలు చూస్తే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయి. గత ఏడాదిగా ఇదే తీరులో  చంద్రబాబు వైఖరి ఉంటోంది. నిరసనలు, ధర్నాలు, విమర్శలు, అచ్చం ప్రతిపక్షం మాదిరిగా ఉన్నాయి.  అసలు ఏపీలో పరిపాలన ఉందా. అన్నీ రాజకీయమేనా. ఇదేనా ఫార్టీ యియర్స్ అనుభవం..


విపక్షంలో ఉన్నారా :


నా ఓటే తొలగిస్తారేమో... ఇదీ తాజాగా చంద్రబాబునాయుడు అన్న మాటలు. ఆయన ముఖ్యమంత్రి. ఆయన ఓటు ఎందుకు తొలగిస్తారు. ఎవరు తొలగిస్తారు. ఓ సీఎం ఓటును కూడా ఏపీలో తొలగిస్తున్నారంటే అది ముఖ్యమంత్రిగా  బాబు అసమర్ధత కాదా. ఆ విషయాన్ని ఇండైరెక్ట్ గా బాబు ఒప్పుకుంటున్నారా. వైసీపీ వాళ్ళు ఓట్లు తొలగిస్తున్నారంటూ ఈ రోజు టెలి కాంఫరెన్స్ లో బాబు పార్టీ నాయకులు చెబుతున్నారు. గత కొన్ని నెలలుగా మా ఓట్లు పోతున్నాయని గగ్గోలు పెడుతోంది వైసీపీ. అపుడు మౌనంగా ఉన్న టీడీపీ అధినాయకుడు, పెద్దలు ఇపుడు పెద్ద నోరు చేస్తున్నారు.  ఐటీ గ్రిడ్ స్కాం బయటకు వచ్చిన తరువాతనే ఈ ఎదురు దాడి మొదలు కావడం ఇక్కడ గమనార్హం.


ఎవరి మీద పోరాటాలు :


ఏపీలో జనం వ్యక్తితగ భద్రత గాలికి పోయింది. వారి డేటా ఇపుడు ప్రైవేట్ సంస్థ చేతిలో ఉందని ఓ వైపు భారీ ఎత్తున ప్రచారం అవుతోంది. ఇంకో వైపు ఓట్లు లక్షల్లో గల్లంతు అవుతున్న వైనం ఉంది. ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నవి. ఈ విషయాలు జనంలోకి పోకుండా టీడీపీ కొత్త డ్రామా మొదలుపెట్టింది. అదేమంటే మా ఓట్లు పోతున్నాయి. వైసీపీ వాళ్ళు తీయించేస్తున్నారు. దీని మీద ఈ రోజు ఆందోళనలకు కూడా పిలుపు ఇచ్చారు. నిజానికి ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నారు. జగన్ సీఎంనా, లేక చంద్రబాబునా. నిజానికి వైసీపీ ఓట్లు తొలగిస్తే జగన్ చిన్నాన్న వివేకానందరెడ్డి ఓటు ఎందుకు పోతుంది. బాబు సొంత జిల్లా పూతపట్టులో వైసీపీ ఎమ్మెల్యే సునీల్ ఓటు ఎందుకు తీసేస్తారు.  అసలు విషయం ఇలా ఉంటే మా ఓట్లు పోతున్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎదురు దాడి చేయడాన్ని ఏమనుకోవాలి.


కాపీ పిలుపు :


ఆఖరుకు నలభయ్యేళ్ల అనుభవం కలిగిన బాబు ఇస్తున్న నిరసన  పిలుపులు కూడా కాపీ అండ్ పేస్ట్ గానే ఉన్నాయి నిన్న నెల్లూరులో జగన్ ప్రజాలను ఉద్దేశించి మీ ఓట్లు పోతే అందుకు బాధ్యుడు అధికారంలో ఉన్న చంద్రబాబే. ఆయన్ని నిలదీయండి అంటూ పిలుపు ఇచ్చారు. ఇవాళ బాబు మీ ఓట్లు జగన్ వల్లే పోయాయి. ఆయన్ని నిలదీయండి అంటూ అదే పిలుపుని కాపీ కొడుతున్నారు. నిజానికి చంద్రబాబు మంత్రులు తీరు చూస్తూంటే ఎదురు దాడే శరణ్యం అనుకుంటున్నట్లుగా కనిపిస్తున్నారు. ఈ విషయంలో లాజిక్ పూర్తిగా మిస్ అవుతున్నారు. జనాలకు ఇది బాగా అర్ధమవుతోంది. కానీ పసుపు బ్యాచ్ కి మాత్రం ఇపుడు కలవరంలో ఏం చేస్తున్నదీ అర్ధం కావడం లేదు. అదే పిటీ...


మరింత సమాచారం తెలుసుకోండి: