పార్టీల మధ్యనే కాదు రాష్ట్రాల మధ్యన కూడా ఓట్ల గల్లంతు అంశం చిచ్చు ని రేపుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న ఓట్ల గల్లంతు వ్యవహారం ఇబ్బందికరం గా మారింది. తెలంగాణా పోలీసులు దీనిమీద కేసు నడుపుతున్న నేపధ్యం లో వ్యవహారం పార్టీల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలూ వేడెక్కాయి.
Image result for chandrababu jagan
ఆంధ్ర ప్రదేశ్ ఎలక్షన్ ని ఎన్నో వారాల సమయం లేకపోవడం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతీ అంశం మీద మీడియా ఎక్కువగా దృష్టి పెడుతోంది ఈ నేపధ్యం లో గవర్నర్ ని కలిసారు వైకాపా - బీజేపీ నేతలు. విడివిడి గా గంట వ్యవధి లో గవర్నర్ నరసింహన్ ని కలిసి ఆంధ్ర ప్రదేశ్ లోని ఓటర్ల డేటా తో ఆంధ్ర ప్రదేశ్ అధికార పార్టీ తెలుగు దేశం చెలగాటం ఆడుతోంది అంటూ మండి పడ్డారు.
Image result for chandrababu jagan
గవర్నర్ ఈ అంశం లో కలగా జేసుకుని న్యాయం చెయ్యాలి అని వారు కోరారు. తెలంగాణా ప్రభుత్వమే కావాలని మా డేటా దొంగలించింది అనేది టీడీపీ ఆరోపణ., గవర్నర్ దగ్గరకి ఈ ఓట్ల గల్లంతు పంచాయతీ చేరడం తో తాను మొత్తం చూసుకుంటాను అని గవర్నర్ సర్ది చెప్పి పంపినట్టు తెలుస్తోంది.
Image result for chandrababu jagan
రెండు రాష్ట్రాల మధ్యనా - రెండు ప్రభుత్వాల మధ్యనా ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లాగా ఉంది పరిస్థితి. రెండు ప్రభుత్వాలూ కూడా పరస్పరం ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. జగన్ కి మేలు చెయ్యడం కోసం కెసిఆర్ ఇది చేస్తున్నారు అనేది టీడీపీ లెక్క. ఒక యాప్ ని అడ్డంగా పెట్టుకుని జనం యొక్క ఓట్లు డిలీట్ చేస్తున్నారు అనేది గవర్నర్ కి వారు ఫిర్యాదు చేసారు.
Image result for chandrababu jagan
జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ తో మాట్లాడుతూ అప్రజాస్వామిక పరిస్థితి మీద కలగజేసుకోవాలి అని కోరారు జగన్. న్యాయాన్ని డిమాండ్ చేస్తున్నాను అంటూ ఇవాళ గవర్నర్ భవన్ లో జగన్ కాస్తంత ఆవేశంగానే గవర్నర్ తో మాట్లాడినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: