జాతీయస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ బాగా రాణించాలంటే తెలంగాణ ప్రజలు రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మొత్తం పార్లమెంటు స్థానాలను టిఆర్ఎస్ పార్టీ గెలిచేలా చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేపథ్యంలో కేటీఆర్ కొత్త నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు...కారు ప్లస్ సర్కారు..డిల్లీ సర్కారు అన్న నినాదాన్ని ఆయన ఇచ్చారు.

Image result for ktr

వచ్చే ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ కూటములకు మెజారిటీ రాదని.. కేసీఆర్‌ నేతృత్వంలో ఏర్పాటయ్యే ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలకం కాబోతుందని తారక రామారావు జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఇతర రాష్ట్రాల్లోని భావసారూప్యత ఉన్న పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏర్పాటు చేసే ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని పేర్కొన్నారు.

Image result for ktr

2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీపై ప్రజలకు ఎన్నో భ్రమలు ఉండేవని.. అయితే, మోదీ పాలనలో దేశం బాగుపడదని ఇప్పుడు అర్థమైందని పేర్కొన్నారు.ఎన్‌డీఏ కూటమికి వచ్చే ఎన్నికల్లో 150 నుంచి 160 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు.

Image result for ktr

ఇక కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరిస్థితి మరింత దిగజారిందని.. ఆ పార్టీ నేతృత్వంలోని యూపీఏకు 110 సీట్లు రావడమే కష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచే 16 మంది ఎంపీలే ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చోవాలో నిర్ణయిస్తారన్నారు. ఎన్నికల తర్వాత దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటవుతుందని, కేసీఆర్‌ నేతృత్వంలోని కొత్త కూటమి 100పైగా సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ‘కారు ప్లస్‌ సారు.. ఢిల్లీలో సర్కారు’అనే నినాదంతో ఎన్నికలకు వెళుతున్నామని కెటిఆర్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: