ఐటీ గ్రిడ్ స్కాం కాదు కానీ ఏపీలో కొత్త రాజకీయ సమరం సాగుతోంది. లాక్కోలేక పీక్కోలేక‌ టీడీపీ సతమతమవుతూంటే వైసీపీ నేతలు మరింతగా దూకుడు పెంచుతున్నారు. ఐటి గ్రిడ్ పై నానా యాగీ పెడుతూ ఓ వైపు టీడీపీ అడ్డంగా దొరికేస్తోంది. ఆ దొరికిన దాన్ని పట్టుకుని వైరిప‌క్షం సంధిస్తున్న ప్రశ్నలు ఇపుడు పసుపు తమ్ముళ్ళను గుక్క తిప్పుకోనీయడంలేదు.


ఉలుకెందుకు బాబూ :


తెలంగాణా పోలీసులు ఐటీ గ్రిడ్ స్కాం మీద విచారణ చేపడితే చంద్రబాబుకు మంత్రులకు ఎందుకు ఉలికిపాటు వచ్చిందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ లాజిక్ పాయింట్ తీశారు. ఈ రోజు విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీకి ఐటీ గ్రిడ్ స్కాం తో సంబంధం లేకపోతే  సీఈవో దాకవరపు అశోక్ ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా అని సవాల్ చేశారు. గత పది రోజులుగా అశోక్ కనబడకపోవడం వెనక అసలు లోగుట్టు ఏంటని కూడా ఆయన నిలదీశారు.


అవెందుకు ఆగిపోయాయి :


ఇక హఠాత్తుగా సేవా మిత్ర యాప్, టీడీపీ వెబ్ సైట్ ఎందుకు ఆగిపోయారో టీడీపీ నాయకులు సమాధానం చెప్పగలరా అని ఆయన గట్టిగా ప్రన్శించారు. ఏపీలో కీలక‌మైన ప్రజల సమాచారం అంతా ప్రైవేట్ చేతుల్లో పెట్టిన టీడీపీ పెద్దలు ఇపుదు తగుదునమ్మా అంటూ పోలీసులకు ఏ విధంగా ఫిర్యాదు చేస్తారని బొత్స  అటాక్ చేశారు.  ఓటర్లకు సంబంధించిన ఆధార్‌, ఓటరు కార్డులు, బ్యాంక్‌ అకౌంట్‌ డేటా, పల్స్‌ సర్వే, ఏపీ ప్రభుత్వంలో జరుగుతున్న పథకాల వివరాలు ఐటీ గ్రిడ్‌ దగ్గర ఉన్నాయని, ఇవి ప్రభుత్వం దగ్గర మాత్రమే ఉండాల్సిన సమాచారం అని బొత్స అన్నారు.


ఏపీలో సైబర్ దొంగలు :


ఏపీలో సైబర్ దొంగలు పడ్డారంటూబొత్స  ఫైర్ అయ్యారు. ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించేలా టీడీపీ వ్యవహారం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో పూర్తి దర్యాప్తు చేసి నిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విజయనగరంలో టీడీపీ కార్యకర్తలు ట్యాబులు పట్టుకుని తిరుగుతున్నపుడే పోలీసులకు తాము ఫిర్యాదు చేశామని, అయితే వారు ఆనాడు పట్టించుకోలేదని బొత్స అన్నారు. ఇది దేశంలోనే పెద్ద స్కాం అని అసలైన వారంతా బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: