అనుకున్నట్లే చంద్రబాబునాయుడుకు ప్రకాశం జిల్లాలో ఎంఎల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి షాకిచ్చారు.  రాబోయే ఎన్నికల్లో మాగుంటను ఒంగోలు ఎంపిగా పోటీ చేయించాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తనకిష్టం లేకపోయినా చంద్రబాబు ఒత్తిడి వల్లే ఎంపిగా పోటీ చేయటానికి ఒప్పుకోక తప్పలేదు. ఒకవైపు మాగుంట పోటిపై చంద్రబాబు ఒత్తిడి పెడుతుంటే మరోవైపు మాగుంట టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరుతారనే ప్రచారం కూడా అంతేస్ధాయిలో జరుగుతోంది.

 

సరే కారణాలేవైనా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చంద్రబాబుతో మాగుంట తేల్చి చెప్పేశారు. తనకు వ్యాపారాలున్నాయని, తనకున్న ఇబ్బందుల వల్ల పోటీ చేయలేకపోతున్నట్లు చెప్పేశారు. దాంతో చంద్రబాబుకు షాక్ కొట్టినట్లైంది. అయితే చేసేది లేక మాగుంటకు ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవదన్న ఫీడ్ బ్యాక్ చూసిన తర్వాతే మాగుంట పోటీనుండి తప్పుకున్నట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

 

వాస్తవాలు పై విధంగా ఉంటే చంద్రబాబేమో దాన్ని మార్చి చెబుతున్నారు. సిబిఐ దాడులకు భయపడి తమ పార్టీ నేత ఒకరు పోటీ నుండి తప్పుకున్నట్లు మీడియాతో చెప్పారు. అదే నిజమైతే మరి గుంటూరు నుండి గల్లా జయదేవ్, నరసరావుపేట నుండి రాయపాటి సాంబశివరావు తదితరులు కూడా తప్పుకోవాల్సిందే కదా ? అలాగే రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌధరి ఎలా కంటిన్యు అవుతున్నారు ?

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: