అనుకున్నట్లే ఫిరాయింపు ఎంఎల్ఏ అత్తార్ చాంద్ భాషకు చంద్రబాబునాయుడు షాకిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు. అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష జరిపారు. అందులో భాగంగా కదిరిలో భాష పై సర్వే నివేదికల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిందట. దాంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని చెప్పేశారట. భాషకు ప్రత్యామ్నాయంగా సీనియర్ నేత కందికుంట వెంకట శివప్రసాద్ భార్యను పోటీ చేయించనున్నట్లు సమాచారం.

 

పోయిన ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన భాష తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు. భాష ఆర్ధిక సమస్యలను చంద్రబాబు తీర్చారని పార్టీ వర్గాలే చెప్పాయి. భాష రూ 7 కోట్లకు అమ్ముడుపోయారంటూ టిడిపి నేతలే అప్పట్లో బహిరంగంగా ఆరోపణలు చేయటం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కద. అందుకే టికెట్లు ఫైనల్ చేయటంలో చంద్రబాబు సమీక్షలు చేస్తున్నారు. జిల్లాలోని పలువురు పోటీ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చంద్రబాబు ఫిరాయింపు ఎంఎల్ఏకి మాత్రం నో చెప్పారు. దాంతో ఫిరాయింపు చంద్రబాబుపై మండిపడుతున్నారు. ప్రలోభాలకు గురై టిడిపిలోకి ఫిరాయించిన ఆ ఎంఎల్ఏ కూడా ఇపుడు న్యాయం, ధర్మం గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది. కందికుంట పై కేసులున్న కారణంగా ఆయన భార్యను పోటీ చేయించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. మొత్తానికి ఇంకెంతమంది ఫిరాయింపులకు చంద్రబాబు షాకిలిస్తారో చూడాలి  .

 


మరింత సమాచారం తెలుసుకోండి: