ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డేటా చోరి వ్యవహారంపై పెద్ద యుద్దమే కొనసాగుతుంది.  ఈ నేపథ్యంతో ఇరు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, టీఆర్ఎస్  పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విషయంలో తెలంగాణ సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  నేరం రుజువైందని తెలిస్తే ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని తెలంగాణ ప్రభుత్వం అంటున్న విషయం తెలిసిందే.  మరోవైపు తమకు తెలియకుండా తమ పార్టీకి సంబంధించిన డేటా తెలంగాణ బహిర్గతం అయ్యిందని టీడీపీ ఆరోపిస్తుంది. 

తాజాగా సీనీ నటుడు శివాజీ నేడు మీడియా ముందు ప్రత్యక్షం అయ్యారు.  ఈ సందర్భంగా ఆయన డేటా చోరీపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.   డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవేనని ఆరోపించారు.  తెలంగాణ ప్రభుత్వం కొన్ని రోజులుగా డేటా చోరీ విషయాన్ని బూచీగా చూపిస్తూ టీడీపీ పై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని.. డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో సకల జనుల సర్వే పేరుతో ప్రజల ఓట్లను వ్యూహాత్మకంగా తొలగించారని, ఆ సమయంలో కేసీఆర్ కు ఎన్నికల సంఘం సహకరించిందని ఆరోపించారు. 

 అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ కు కేంద్రం పూర్తిగా సహకరించిందని అన్నారు.  ఇప్పుడు ఓట్ల తొలగింపు పై గట్టిగా మాట్లాడుతున్న టీఆర్ఎస్ గతంలో ఓట్ల తొలగింపు పై కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదని విమర్శించారు. దీన్ని బట్టే అర్థం అవుతుంది..కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం ఏ తరహా సహకారం అందిస్తుందో.  ఓట్ల తొలగింపు వ్యవహారం తెలంగాణలో సాఫీగా సాగిపోయిందని, అదే తరహాలో ఏపీలో చేయాలని కేసీఆర్ చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: