సినీ నటుడు శివాజీకి రాజకీయాల్లోకి రావాలని కోరిక బాగా ఉంది. కానీ ఆయన మాత్రం తమకు పదవుల ఆరాటం లేదంటాడు. కానీ చెప్పేవన్నీ రాజకీయ కబుర్లే.   గరుడ పురాణాలు చెప్పి అప్పట్లో టైం పాస్ చేసిన శివాజీ ఇపుడు మరో మారు టీవీ ముందుకు వచ్చేశారు.


బాబుకు బుక్ చేసేశారు :


శివాజీ ఇవాళ  తాపీగా మీడియా ముందుకు వచ్చి చెప్పిందేంటయ్యా అంటే డేటా చోరీ అన్నది దేశవ్యాప్తంగా జరుగుతోంది. కాబట్టి అది అధికారికమైన నేరమే అని సమర్ధించాడు. కేసీయార్ తెలంగాణాలో చేశారు. డిల్లీలో అమిత్ షా చేయబోతున్నారు,  మోడీ కేంద్రంలో చేయబోతున్నారంటూ ఏవేవో వూహాగానాల వార్తా  కధనాలు వినిపించాడు. ఇదంతా బాగానే ఉంది కానీ ఏపీ సీఎం చంద్రబాబు కూడా డేటా చోరీ చేశారని  చెప్పకుండా చెప్పేయడమే ఇక్కడ విశేషం. అందరూ చేశారు, చేస్తున్నారు. అందులో తప్పేముంది అన్నట్లుగా మాట్లాడిన శివాజీ బాబు కూడా చేశారని కచ్చితంగా నిర్దారించేశారు.


కాదంటున్న బాబు :


ఇంతకీ విషయమేంటంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ కూడా డేటా చోరీ కాలేదని ఇప్పటికీ చెబుతున్నారు. మంత్రులు సామంతులు, అధికారులు అంతా కూడా డేటా భద్రంగా ఉందని అంటున్నారు. మరో వైపు టీడీపీ డేటా అది అని కూడా వారు అంటున్నారు. మరి టీడీపీ వాదన ఇలా ఉంటే శివాజీ మాత్రం డేటా చోరీ అందరూ చేశారు, చంద్రబాబు కూడా అనుసరించారు అన్నట్లుగా మాట్లాడడం ద్వారా బాబు ఇప్పటివరకూ చెబుతున్న వాదనలన్నీ కూడా పక్కకు పోయేలా చేసేశాడు. నిజానికి ప్రెస్ మీట్ పెట్టింది బాబు గారిని సపోర్ట్ చేయడానికి, కానీ అక్కడ మాత్రం ఆయన బాబు కూడా డేటా చోరీకి పాల్పడ్డారు అన్నట్లుగా చెబుతూ పోవడమే ఇక్కడ విశేషం.


ఆ ఉదాహారణలు ఎలా :


తెలంగాణా అధికారులు, ఎన్నికల సంఘం కలసి  2015 లో అక్కడ ఓ ప్రైవేట్ ఏజెన్సీకి కాంట్రాక్ట్ కి టెండర్లు పిలిచి మరీ ఓటర్ల జాబితా డేటా అనుసంధాం కోసం ఇచ్చారని శివాజీ చెబుతున్నారు. అంటే శివాజీ మాటల్లోనే అక్కడ జరిగింది అంతా అధికారికంగానే, పైగా ప్రైవేట్ ఏజెన్సీకి డేటా అనుసంధాం కాంటాక్ట్ ఇచ్చినా కూడా ఆ తరువాత దాన్ని డిలీట్ చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో  అన్నీ తీసుకుంటారు కూడా. 


ఆ మాటకు వస్తే ఆధార్ కార్డ్ నమోదు మొత్తం ప్రైవేట్ కాంట్రాక్ట్ తోనే జరిగింది. అంత మాత్రం చేత వారి చేతుల్లోకి డేటా పోయిందనుకోవాలా. అలా కాదు, సిబ్బంది తక్కువగా ఉన్నపుడు ప్రతి ప్రభుత్వ సంస్థ చేసేది అదే. కానీ కొన్ని విధి విధానాలు, కట్టుబాట్లు పెట్టుకుని చాలా జాగ్రత్తగా డేటా కలెక్ట్ చేసే విషయం ప్రవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తారు. కానీ ఇక్కడ జరిగిందేమిటి  కాంట్రాకు ఎవరు కుదుర్చుకున్నారు. ఎలా  కుదుర్చుకున్నారు  ఐటీ గ్రిడ్ అన్నది కేవలం టీడీపీ పనుల కోసం ఉన్న సంస్థ దానికి మొత్తం  ఎపీ ప్రజల ప్రైవేట్ డేటా ఎలా వచ్చింది. 


ఇందులో అధికారులు ఎక్కడా లేరుగా. ఏ ఒప్పందమూ ప్రభుత్వం తరఫున లేదుగా. పైగా ఇక్కడ ఓట్ల తొలగింపు వంటి పెద్ద నేరం జరుగుతోందని కదా ఆరోపణ. బోడి గుండుకూ మోకాలికి ముడి పెట్టి శివాజి మాట్లాడిన మాటలు టీడీపీని మరింతగా ఇబ్బందులో పడేసాయి తప్ప, దీని వల్ల వేరేది ఏమీ లేదని చెప్పాలి. డేటా చోరీ అంతటా ఉంది, తప్పేముంది అని చిన్న నేరంగా ఎప్పటి నుంచో ఉన్న  వ్యవహారంలా చూడడం బాధ్యత గల పౌరునిగా శివాజీకి తగదు. ఇక్కడ ఐదు కోట్ల ప్రజల వ్యక్తిగత వివరాలు మొత్తం అనధికారికంగా ఓ సంస్థ చేతిలో ఉన్నాయి. ఇది చాలా సున్నితమైన అంశం. 



మరింత సమాచారం తెలుసుకోండి: