ఏపీలో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఇపుడు రెండు ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి. ఈసారి గెలవకపోతే కష్టమని వైసీపీ, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ విపరీతంగా ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఎన్నడూ లేని విధంగా మారుతోంది.


జగన్ కే ఎడ్జ్ :


తాజాగా టీయారెస్ చేయించిన ఓ సర్వే అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.ఆ సర్వే ప్రకారం  చూసుకుంటే ఏపీలో వైసీపీకి 105 నుంచి 110 సీట్లు వస్తాయని తేలిందట. అదే విధంగా టీడీపీకి 55 సీట్లు కంటే మించి రావని లెక్కలు చెప్పాయట. ఇక మిగిలిన 20 సీట్లలో జనసేన, బీజేపీ, కాంగ్రెస్ వంటి ఇతర పార్టీలు సర్దుకుంటాయని సర్వే విశ్లేషించింది. దీంతో వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీగా ఉంటే టీడీపీలో కంగారు మొదలైంది.


ప్రభావం చూపాయి :


ఈ సర్వేలో కొన్ని విషయాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. నిజానికి టీడీపీకి 55 కంటే తక్కువ సీటే  రావాలంట. కానీ చంద్రబాబు ఈ మధ్యన ప్రకటించిన పసుపు కుంకుమ, పించను పెంపు, ఇతర రాయితీలు వంటివి కొంత ప్రభావం చూపడం వల్ల సీట్లు టీడీపీకి పెరిగాయని సర్వేలో తెలిసిందిట. ఇక బాబు ఎన్నికలకు ముందు మరిన్ని వరాలు ఇవ్వడం, జనాలకు ప్రభావితం చేయడం, ఎలెక్షనీరింగ్, పోల్ మేనేజ్మెంట్ వంటివి చేస్తారు కాబట్టి అలెర్ట్ గా ఉండమని టీయారెస్ వైసీపీని కోరుతోందిట. ఇప్పటికైతే వైసీపీకి ఢోకా లేదని, కానీ ఎన్నికలు దగ్గరపడేకొద్దీ బాబు ఎత్తులకు పై ఎత్తులు వేయకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటాయని కూడా వైసీపీకి టీయారెస్ సూచిస్తోందని భోగట్టా.


మరింత సమాచారం తెలుసుకోండి: