ఐటీ గ్రిడ్ అన్నది ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. ఓ విధంగా చెప్పాలంటే సమరోత్సాహంతో ముందుకు కదులుతున్న టీడీపీకి ఒక్కసారిగా బ్రేకులు వేసినట్లైంది. సరే ఈ కధ ఇపుడే మొదలైంది. మరి ఎంతవరకూ వెళ్తుందో...


మౌనంతో భయమే :


ఐటీ గ్రిడ్ స్కాం బయటకు వచ్చాక ఇంతవరకూ తెలంగాణా సీఎం కేసీయార్ మీడియా ముందుకు రాలేదు. పెదవి విప్పలేదు. కేసీయార్ వ్యూహాలు చాలా పదును తేరి ఉంటాయి. అలాంటిది ఒకటి ఓటుకు నోటు కేసులో అంతా చూశారు. అప్పట్లో కేసీయార్ వెంటనే మీడియా ముందుకు వచ్చి నిప్పులే చెరిగారు. ఇపుడు మాత్రం ఆయన మౌనాన్ని ఆశ్రయించడం పట్ల సర్వత్రా ఆశ్చర్యంతో పాటు ఉత్కంఠ కూడా రేగుతోంది. ఈ కేసును కేసీయార్ ఏ మలుపు తిప్పుతారో అన్న కంగారు ఏపీ టీడీపీలో ఎక్కువగా  ఉంది.


సీబీఐ వేస్తారా :


ఏకంగా జాతీయ స్థ్తాయిలోనే ప్రకంపనలు రేపిన ఈటీ గ్రిడ్ స్కాం వెనక నివ్వెరపోయే నిజాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద సిట్ వేసి మరీ తెలంగాణా సర్కార్ విచారణ దూకుడుగా చేయిస్తోంది. ఇంతటితో ఆగకుండా సీబీఐ విచారణకు కూడా కోరాలని కేసీయార్ ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అదే కనుక జరిగితే టీడీపీకి ఇబ్బందులు దారుణంగా ఉంటాయని అంటున్నారు. ఓ విధంగా
షాకింగ్ లాంటి పరిణామాలు అనేకం చోటు చేసుకుంటాయని కూడా చెబుతున్నారు.



కేసీయార్ ఓటు కు నోటు కేసునే అప్పట్లో సీరియస్ గా తీసుకున్నారు. అయితే నాడు బాబుకు కేంద్రంలోని మోడీ సర్కార్ మద్దతు ఉంది. ఇపుడు ఏమీ లేని వేళ కేసీయర్ తనదైన రాజకీయాన్ని మొత్తం చూపించి బాబును చక్రబంధంలో ఇరికిస్తారని అంటున్నారు. మొత్తానికి కేసీయార్ మౌనం మాత్రం టీడీపీని బాగా భయపెడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: