ఎన్నికలు రాజకీయాలు ఈ విషయంలో చంద్రబాబు బాగా పండిపోయారు. ఆయనది నలభయ్యేళ్ళ అనుభవం. మరి రెండు ఎన్నికలను మాత్రమే చూసిన జగన్ బాబుతో పోటీ పడుతున్నారు. ఐతే జగన్ కూడా పాత పొరపాట్లకు ఎక్కడా తావు ఇవ్వకుండా ఈసారి వీలైనంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


బాబు సెలెక్షన్ చూసి :


ఇక ఏపీలో అభ్యర్ధుల ఎంపికలో టీడీపీ ముందుంది. వరసగా అన్ని సీట్లకు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ఆ పార్టీ ప్రకటించుకుంటూ వెళ్తోంది. దాంతో టీడీపీలో జోష్ బాగానే కనిపిస్తోంది. మరో వైపు చూసుకుంటే వైసీపీ మాత్రం అనధికారికంగా తప్ప ఎక్కడా సెలెక్షన్ ఇదీ అన్నట్లుగా ఇప్పటికైతే న్యూస్ లేదు. మరి ఈ విషయంలో జగన్ ఏం చేస్తున్నారు అంటే దానికి ఓ చిత్ర‌మైన విషయం బయటకు వచ్చింది. జగన్ బాబుకు ఇపుడు బాగా గమనిస్తున్నారుట


ఆ మీదటే :


బాబు ఎంపిక చేసిన అభ్యర్ధులను గమనించి ఆ తరువాతనే తన పార్టీ అభ్యర్ధులను ప్రకటించాలని జగన్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే బలాబలాలను ఎన్నికల ముందే సరి చూసుకోవచ్చునని మెరుగైన ఎంపికకు చాన్స్ ఉంటుందని జగన్ వ్యూహం అంటున్నారు. గత ఎన్నికల్లో జగన్  ముందు అభ్యర్ధులను ప్రకటించారు. దాని అడ్వాంటేజ్ గా తీసుకుని బాబు బలమైన వారిని ముగ్గులోకి దించి హిట్ కొట్టేశారు.


 ఇపుడు అదే ఫార్ములాను జగన్ నమ్ముకున్నారు. అయితే ఇది  బాగానే ఉంది కానీ  అభ్యర్ధుల సెలెక్షన్  బాగా లేట్ చేస్తే మాత్రం బెడిసికొట్టి అసలుకె ఎసరు వస్తుందని కూడా పార్టీలోని కొంతమని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి బాబు జగన్ దాగుడుమూతలతో సీటు కోరుకుంటున్న వారిలో యమ టెన్షన్ పెరిగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: