చంద్రబాబు వ్యవహారశైలి తమ్ముళ్లకు మంటగా ఉంటోందా. సమీక్షలు పేరుతో గంటల తరబడి అభిప్రాయ సేకరణ చేస్తున్న చంద్రబాబు చివరకు అదంతా మొక్కుబడి తంతుగా ముగుస్తూ తనకు నచ్చిన వారినే పార్టీ అభ్యర్ధులుగా ప్రకటిస్తున్నారు. ఈ రకమైన వైఖరి పార్టీలో ఉన్న తమ్ముళ్లకు మంట పుట్టిస్తోందట. తాము చెబుతున్న దాన్ని వినకుండా అంథా ఇష్టారాజ్యంగా బాబు చేసుకుపోతున్నారని తమ్ముళ్ళు నిరసల గళం వినిపిస్తున్నారు.


మంత్రి అయ్యన్న అలా :


విషయానికి వస్తే విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు చంద్రబాబుపై లేటెస్ట్ గా మరో మారు గుస్సా అయ్యారు. జిల్లాకు చెందిన పార్టీ అభ్యర్ధుల విషయంలో బాబు వ్యవహారశైలి  ఈ సీనియర్ మంత్రికి చికాకు తెప్పిస్తోందని అంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న అయ్యన్న బాబు కంటే సీనియర్ మంత్రి. అటువంటి అయ్యన్న ఈ రోజు అమరావతిలో చంద్రబాబు నాయుడుతో సమావేశం జరుగుతున్న సమయంలోనే  బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత సీఎం నుంచి ఫోన్‌ వచ్చిన అయ్యన్న లిఫ్ట్‌ చేయలేదు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


పదవులు వాళ్ళకేనా :


పార్టీలు మార్చి వచ్చిన వారికే పదవులు ఇస్తే.. పార్టీని నమ్ముకున్న వారి పరిస్థితి ఎంటని టీడీపీ అధిష్టానాన్ని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. పార్టీని నమ్ముకుని ఉన్నవారికే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లలో ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పార్టీలు మరి వచ్చిన వారు పదవులు అనుభవించి వెళ్లిపోతే.. పార్టీ కోసం కష్టపడిన వారి పరిస్థితి ఎమిటని నిలదీశారు. కొత్తగా వచ్చినవారి కోసం గతంలో ఎంపీ సీటు వదిలేసుకున్నామని గుర్తుచేశారు. ఈ సారి కూడా అలాంటి వారికే ఎంపీ సీటు ఇస్తామంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. 


వారిమీదేనా :


అయ్యన్న మాటలు చూస్తూంటే ఆయన మరో మంత్రి గంటా శ్రీనివాసరావు మీద తన బాణాలు ఎక్కుపెట్టినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో అనకాపల్లి సీటుని తన కుమారుడు విజయ్ కి కోరుకుంటున్నారు. ఆ విషయాన్ని పట్టించుకోని బాబు మాజీ మంత్రి కొణతాల తో పాటు, ఇతర పార్టీల వారికి గేలం వేస్తూ సీట్లు పంచిపెట్టడానికి సిధ్ధపడడంపై అయ్యన్న మండిపడుతున్నారని అంటున్నారు. చూడాలి ఈ సీనియర్ మంత్రి ఆగ్రహం ఎంతవరకూ వెళ్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: