టాలీవుడ్ లో బాలనటుడిగా తన ప్రస్థానం మొదలు పెట్టి...స్టార్ కమెడియన్ గా ఎదిగిన ఆలీ కొంత కాలంగా రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే.   గత సార్వత్రిక ఎన్నికలలో ఏపిలో టీడీపీ నుంచి పోటీ చేయాలని చూసినా చివర్లో బెడిసి కొట్టింది.  ఇక నటుడి కంటిన్యూ అవుతూ వచ్చిన ఆలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఏపిలో వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆలీ నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  వాస్తవానికి ఆలీ పవన్ కళ్యాన్ కి మంచి స్నేహితుడు..అప్పట్లో వైసీపీలో జాయిన్ అవుతారని భావించారు..కానీ ఆలీ మాత్రం సీఎం చంద్రబాబు తో మీట్ అయ్యారు..ఇక టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పుకార్లు షికార్లు చేశాయి. 

కానీ ఆలీ మాత్రం టీడీపీనీ ఊరిస్తూ ఊరిస్తూ..ఈ రోజు డ్రామాకు తెరదింపారు.  ఈరోజు ఉదయం ఆయన వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్‌పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అనంతరం అలీ దాదాపు పావుగంటపాటు పలు అంశాలపై చర్చించారు. అనంతరం పార్టీ కండువా వేసి పార్టీలోకి అలీని జగన్‌ సాదరంగా ఆహ్వానించారు.  అయితే గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని ఆశించిన అలీ ఇటీవలే గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన ఓటరు నమోదు దరఖాస్తు అందించారు.

ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు టీడీపీ అధినేత నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతోనే ఆయన లోటస్‌పాండ్‌వైపు మళ్లినట్టు భావిస్తున్నారు. అలీ గుంటూరు లేదా రాజమండ్రి నుంచి వైసీపీ తరపున పోటీ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.  అయితే ఆలీ వెంట నటుడు కృష్ణుడు కూడా వైసీపీ కండువ కప్పుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: