ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. చూడబోతే అన్ని పార్టీలు పరుగులే పెడుతున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యాక ఇక నిలిచే తీరిక కూడా పార్టీలకు ఉండడంలేదు. ఈ పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీ రెండూ కూడా పగలూ రాత్రి  కూడా కష్టపడాల్సివస్తోంది. అదే సమయంలో జనసేన కూడా సై అంటోంది.


ముందే జాబితా :


ఇక జనసేన అందరికంటే ముందే జాబితాను ప్రకటించాలనుకుంటోంది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్ధుల లిస్ట్ ను ఆమోదించారని అంటున్నారు. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది. ఇందులో తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల స్థానాలు ఉండే అవకాశం ఉంది. ఈ జాబితాను ఈ రోజు సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


ఫస్ట్ ఛాన్స్ కోసమా : 


ఇక జనసేన తన  తొలి జాబితాను విడుదల చేశాక మిగిలిన సీట్లపైన కూడా కసరత్తు మొదలవుతుందని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి. . షెడ్యూల్ ముందుకు జరగడంతో అన్ని పార్టీల కంటే ఎక్కువ ఇబ్బందుకు జనసేనకు ఉంటాయని అంతా వూహిస్తున్న తరుణంలో పెద్ద పార్టీలకు షాక్ ఇచ్చేలా జనసేన తన జాబితాను ఫస్ట్ రిలీజ్ చేసి షాక్ ఇవ్వబోతోంది. మరి మిగిలిన జాబితాలను ఆ పార్టీ ఎపుడు విడుదల చేస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: