తెలుగుదేశంపార్టీలో అందరి మధ్య ఇపుడిదే చర్చ నడుస్తోంది. సొంతజిల్లా చిత్తూరును కాదని ఏకంగా తొమ్మిది జిల్లాలు దాటి పదో జిల్లా అయిన విశాఖపట్నంపై లోకేష్ కన్నేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. భీమిలీ నియోజకవర్గం లోకేష్ కు అత్యంత సురక్షితమైన నియోజకవర్గమని చంద్రబాబునాయుడు భావించినట్లున్నారు. కానీ జిల్లా నేతల అంచనాలు మాత్రం వేరే విధంగా ఉంది.

 Image result for lokesh

విశాఖపట్నం జిల్లాలోని భీమిలీకి సంబంధించిన టిడిపి నేతలతో మాట్లాడితే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. అందులో మొదటిదేమిటంటే, నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం ఓటర్లు చాలా తక్కువమందున్నారట.  నియోజకవర్గం మొత్తం మీద కాపు సామాజికవర్గం ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. తర్వాత జాలర్లు, నాగవంశీయులు అంటే బిసిలున్నారు. తర్వాత క్షత్రియులు, ఎస్టీలు, ఎస్సీలున్నారు. మిగిలిన సామాజికవర్గాల ఓటర్ల సంఖ్య తక్కువనే చెప్పాలి.

 Image result for lokesh

ఇక రాజకీయ కోణంలో చూస్తే సిట్టింగ్ ఎంఎల్ఏ, మంత్రి గంటా శ్రీనివాసరావుపై జనాలు బాగా మంటమీదున్నారు. భీమిలీ కేంద్రంగా గంటా పాల్పడిన భూ కుంభకోణాలపై విపరీతమైన ఆరోపణలున్నాయి.  ఫలితంగా టిడిపిపైన వ్యతిరేకత వచ్చేసింది. అదే సమయంలో మాజీ ఎంపి, భీమిలీలో వైసిపి తరపున పోటీ చేస్తాడని అనుకుంటున్న అవంతి శ్రీనివాస్ బలమైన అభ్యర్ధి. అంగ, అర్ధ బలాల్లో బాగా గట్టి అభ్యర్ధనే అనుకోవాలి.

 Image result for lokesh

పైగా సామాజికవర్గంలో మంచి పట్టున్న నేత. గంటాతో పోల్చుకుంటే అవంతి శ్రీనివాస్ పై సామాజికవకర్గంలోనే కాకుండా టిడిపిలో కూడా అవంతి అంటే సానుకూత ఉంది. పైగా గంగాను బలవంతంగా నియోజకవర్గాన్ని మారుస్తున్నారు. అందుకనే లోకేష్ కు గంటా మద్దతు ఎంతుంటుందనేది అనుమానమే.  పైగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రతో వైసిపి వైపు జనాల సానుకూలత కూడా బాగా కనబడుతోంది.

 Image result for lokesh

సొంత జిల్లా చిత్తూరును కాదని ఎక్కడో ఉన్న విశాఖపట్నం భీమిలీని ఎందుకు ఎంచుకున్నట్లు ? ఇపుడిదే ప్రశ్న భీమిలీలో చక్కర్లు కొడుతున్నాయట. పైగా లోకేష్ ఏమీ బ్రహ్మాండమైన పట్టున్న నేత కూడా కాదు. పైగా స్ధానికేతరులను ఒకసారి నెత్తికెక్కించుకుంటే ఇక దింపటం సాధ్యం కాదని జనాల్లో చర్చ మొదలైందట. పోయిన ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ పోటీ చేసినపుడు టిడిపి నేతలు చేసిన నెగిటివ్ ప్రచారాల్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఏ రకంగా చూసినా లోకేష్ కు భీమిలీ అంత సురక్షితమైన నియోజకర్గం మాత్రం కాదు. మళ్ళీ చంద్రబాబు పోటీ చేస్తే పరిస్ధితులు మారిపోతాయి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: