కడప జిల్లాలోని మరొక ఆసక్తికరమైన మరియు క్లిష్టతరమైన నియోజకవర్గం జమ్మలమడుగు. ఇక్కడ ఆధిపత్యం కాంగ్రెస్ మరియు తెలుగుదేశం పార్టీల మధ్య చేతులు మారుతూ వచ్చేది. పొన్నప్ప రెడ్డి కుటుంబానికి చెందిన శివారెడ్డి మరియు రామసుబ్బారెడ్డి వరుసగా నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు. అయితే చివరి మూడు సార్లు మాత్రం ఆదినారాయణ రెడ్డి ఏకగ్రీవంగా జమ్మలమడుగులో తన సత్తా చాటారు. అయితే వైసిపి గుర్తు పైన గెలిచిన ఆదినారాయణరెడ్డి తరువాత టీడీపీలో మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు అతను రామసుబ్బారెడ్డి సీటు కి ఎసరు పెట్టాడు. అధిష్టానం దగ్గర కొద్దిరోజులు ఇద్దరు తమ సీటు విషయమై చర్చించగా బాబు మాత్రం ఆదినారాయణ రెడ్డి వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటు వైపు వైసీపీ అభ్యర్థిగా  సుధీర్ రెడ్డి ఖరారు అయ్యాడు. అతను నిమ్మ కింద నీరులా తన పని తాను కానిస్తున్నాడు. కొమ్ములాటలు మధ్య తెలుగుదేశం పార్టీ ఇ నియోజకవర్గంలో తమ పట్టు కోల్పోతోంది అని కొందరు వాదిస్తున్నా, మరికొందరు మాత్రం ఆదినారాయణ రెడ్డి హవా ముందు ఏదీ చెల్లదని అంటున్నారు. పార్టీతో సంబంధం లేకుండా గెలిచినా సత్తా ఉన్న నాయకుడిగా ఆయనకు అక్కడున్న పేరు అలాంటిది మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: