తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో మాత్రం వ్యతిరేక పవనాలు పసుపు పార్టీకి గట్టిగానే వీస్తున్నాయి. అంతకుముందు వారి పార్టీ నుండి పోటీ చేసి బంపర్ మెజారిటీ సాధించిన అబ్దుల్ ఘని ఇప్పుడు ప్రముఖ సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బాల కృష్ణ ను సవాలు చేస్తున్నాడు. 1996 లో నందమూరి హరికృష్ణ కూడా ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. సూటిగా మాట్లాడాలంటే బాలయ్య తన పరిస్థితిని తనకు తానుగా క్లిష్టతరం చేసుకున్నాడు. సినిమాలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి తన నియోజకవర్గపు ప్రజలను అసలు పట్టించుకోలేదు అనే అపవాదు మూటగట్టుకున్నారు. మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్ వైఫల్యం మరియు బాలయ్య ఫన్నీ స్పీచ్ ల ప్రభావం అతని ఓటు బ్యాంకు పైన పడుతుందని విశ్లేషకుల అంచనా. వ్యక్తిగతంగా ఎంతో అభివృద్ధిపరిచిన వ్యక్తిగా అబ్దుల్ ఘని కి ఇక్కడ చాలా మంచి పేరు ఉండడం బాలకృష్ణకు మరొక ప్రతికూల అంశం. అయితే బాలయ్య ఎప్పుడూ చాలా గొప్పగా ప్రస్తావించే తమ చరిత్రను నిలబెట్టుకుంటాడో లేక దాన్ని మార్చేందుకు వైసీపీకి అవకాశం ఇస్తాడో వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: