గంటా శ్రీనివాసరావు. ఎదురులేని నాయకుడు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి. ఆయన ఏదనుకుంటే అదే రాజకీయాల్లో చేస్తారు. ఎత్తులు పై ఎత్తులు వేయడంతో దిట్ట. అటువంటి గంటా ఇపుడు ఏమీ కాకుండా పోతున్నారా అన్న అనుమానాలు విశాఖ జిల్లా టీడీపీ రాజకీయాలను చూసిన వారికి అనిపిస్తున్నాయి.


విశాఖ జిల్లాలో అందరి సీట్లు ఖరారు అయ్యాయి కానీ, మంత్రి గారి సీటు మాత్రం ఏంటో ఇప్పటికీ తెలియలేదు. గంటా సీటు భీమిలీ నుంచి టీడీపీ భావి నాయకుడు, బాబు వారసుడు నారా లోకెష్ పోటీకి దిగుతున్నారని అంటున్నారు. దాంతో గంటాకు పెద్ద కుదుపు తప్పడంలేదు. ఆయన మరో అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని చెప్పినా కూడా పెద‌బాబు ఒప్పుకోవడంలేదట. పోనీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పినా వినడంలేదట.


గంటాను విశాఖ ఎంపీ సీటుకు పోటీ పెట్టాలని బాబు గారి తాపత్రయం. దాదాపు రెండు దశాబ్దాలుగా విశాఖ ఎంపీ సీటు టీడీపీకి చిక్కడంలేదు. దాంతో గంటాను దింపడం ద్వారా కాపుల ఓట్లతో ఆ సీటు కొల్లగొట్టాలని భావిస్తున్నారుట. రేపటి రోజున కేంద్రంలో రాహుల్ నాయకత్వంలో యూపీయే 3  సర్కార్ వస్తుందని, కేంద్ర మంత్రి పదవి ఇప్పిస్తానని బాబు అంటున్నట్లు భోగట్టా. ఎన్ని చెప్పి ఒప్పించినా గంటా మాత్రం అసెంబ్లీకే అంటున్నారుట. మరి ఈ మంత్రి గారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారో తెలియక‌ అనుచరులు కలవరపడుతున్నారు. ఇదేంటి  మా మంత్రి గారికే ఇలా అయిందని వాపోతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: