వైసీపీ అధినేత జగన్ రాజకీయ జీవితం మొత్తం ప్లస్  మైనస్సుల మధ్యనే పోటీ పడుతూ గత పదేళ్ళుగా సాగుతూ వస్తోంది. కొండంత తండ్రి, ఎదురులేని ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి పట్టుమని మూడు నెలలు కూడా గడవకముందే వైఎస్సార్ దుర్మరణం పాలు కావడం జగన్ జీవితంలో అతి పెద్ద శాపం. ఓ విధంగా అదే జగన్ కి మైనస్ కూడా అయిందనుకోవాలి. .  రాజకీయంగా జగన్ ఎదగడానికి తండ్రి పేరు ఎంతలా ఉపయోగపడిందో అంతే విధంగా ఆ పాలనలోని మంచి చెడులూ కూడా వారసత్వంగా వచ్చేశాయి. అవేంటో చూద్దాం.


1. జగన్ ఇప్పటివరకూ అధికారంలోకి రాకపోయినా నాడు కాంగ్రెస్ సర్కార్ టైంలో జరిగిన అవినీతి ఆయన్ని ఇప్పటికీ వెంటాడుతోంది. జగన్ వస్తే మళ్ళీ అవినీతి పాలనేనని టీడీపీ గత‌ ఎన్నికల్లో గొంతెత్తి అరచింది. ఇపుడు కూడా అదే విమర్శలు చేస్తోంది.

2. జగన్ పై ఉన్న కేసులు అపుడూ, ఇపుడూ కూడా పెద్ద మైనస్ పాయింట్లే. ఆయన జైలుకు వెళ్ళి వచ్చాడని, నేరస్తుడని చంద్రబాబు గత ఎన్నికల్లో చెప్పి బాగానే లబ్ది పొందారు. ఇపుడు అదే నినాదం బయటకు తీస్తున్నారు. జగన్ ఈ విషయంలో డిఫెన్స్ లోనే ఉంటున్నారు

3. జగన్ ప్రతిపక్ష నేతగా కొన్ని విజయాలు, మరికూని వైఫల్యాలు మూటకట్టుకున్నారు. రెండేళ్ళ పాటు అసెంబ్లీ ముఖం చూడకుండా ఉండడం జగన్ కి [పెద్ద  మైనస్ పాయింట్ గానే చూడాలి. అదే టీడీపీ ప్రచారం కూడా అవుతోంది.

4 ఓ వైపు కేంద్రంలోకి మోడీ, పక్కన ఉన్న కేసీయార్తో జగన్ పొత్తు పెట్టి ఏపీలో ఆయన ఇమేజ్ ని దెబ్బ తీయాలని చంద్రబాబు ఎత్తులు వేస్తున్నారు. దాన్ని ఇప్పటివరకూ సమర్ధంగా తిప్పికొట్టలేకపోవడం జగన్ కి మరో మైనస్ పాయింట్ గా మారుతోంది.

5 ప్రత్యేక హోదాపై ఒకపుడు గొంతెత్తి అరచిన జగన్ ఇపుడు అంతగా మాట్లాడకపోవడం కూడా మైనస్ పాయింట్ గానే చూడాలి. ఇక అమరావతి రాజధాని కట్టడం జగన్ కి ఇష్టం లేదు, పోలవరం ప్రాజెక్ట్ ను జగన్ తెలంగాణా, , ఓడిషా ప్రభుత్వాలతో కలసి అడ్డుకుంటున్నారని పదే పదే టీడీపీ ఆరోపణలు చేస్తోంది. జగన్ దాన్ని కూడా గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నారు.  ఎన్నికల వేళ ఇది కూడా మరో మైనస్ పాయింట్ గానే చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: