విశాఖ అంటే వలస రాజకీయాలకు కెరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఇక్కడ లోకల్ గా పోటీ చేసేందుకు ఎవరూ లేరన్నట్లుగా బయట నుంచి నాయకుల దిగుమతి ప్రతీ ఎన్నికలోనూ జరుగుతోంది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా విజయమ్మ పోటీకి దిగారు. ఆమె ఎంపీ సీటుకు వైసీపీ తరఫున పోటీ చేస్తే ఆమె నాన్ లోకల్ అని, కడప జిల్లా అరాచకం అంటూ విపరీతమైన ప్రచారం చేసిన టీడీపీ పెద్దలు చివరకు ఆ నెగిటివ్ ప్రచారంతోనే ఆమెను ఓడించేశారు. ఇపుడు నారా లోకేష్ విశాఖలో  పోటీ చేస్తున్నారు.


మరి లోకెష్ ఏమైనా విశాఖకు ముద్దు బిడ్డా అంటే ఏం కాదే. ఆయన కూడా సీమ జిల్లాల‌కు చెందిన నాయకుడే. చెప్పాలంటే విజయమ్మ ఏపీలో పాపులర్ నాయకురాలు. విశాఖ ఎంపీగా పోటీ చేసేనాటికి ఆమె ఒకమారు ఎమ్మెల్యేగా గెలిచిన నేత. అలాగే వైసీపీ తరఫున వూరూ వాడా ప్రచారం చేసి ఉప ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించిన లీడర్. అటువంటి విజయమ్మ విశాఖలో పోటీ చేస్తేనే నాన్ లోకల్ అంటూ పేరు చెప్పి ఓడించిన టీడీపీ నాయకులు ఇపుడు చినబాబుకు మాత్రం ఘన స్వాగతం పలుకుతున్నారు.


మొదట భీమిలీ నుంచి చినబాబు పోటీ అన్నారు. అయితే అక్కడ పార్టీ చేసిన  సర్వేల్లో తేడా కొట్టడంతో విశాఖ ఉత్తరాన్ని ఎంచుకున్నారని లేటెస్ట్ టాక్. ఇక్కడ కాస్మో పాలిటిన్ సిటీ వాతావరణం ఉంటుందని, అందువల్ల లోకేష్ గెలుపు సులువు అవుతుందని టీడీపీ తమ్ముళ్ళు అంచనా వేస్తున్నారు. అయితే విశాఖపై నాన్ లోకల్ నేతలను రుద్దితే ఊరుకోబోమని గతంలో గట్టిన చెప్పిన టీడీపీ నేతల మాటలు ఇపుడు జనం చెవుల్లో మారుమోగుతున్నాయి. అదే సంగతిని వారు బాగా గుర్తుంచుకుంటే మాత్రం లోకేష్ బాబుకు ఉత్తరం కూడా ఝలక్ ఇచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి. మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: