2014 ఎన్నికల్లో టీడీపీ  తరుపున ఒంగోలు లో పోటీ చేసిన మాగుంట మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి పోటీ చేయనని చెప్పి , వైస్సార్సీపీలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీనితో టీడీపీ కి అభ్యర్థి కరువయ్యాడు. దీనితో చంద్ర బాబు అందరి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం అధినేత తండ్లాడుతున్నారు. అనేకమంది నేతలను ఫిరాయించి తెచ్చుకున్నా, కాంగ్రెస్ లో మిగిలిన ముతక సరుకును కూడా తెచ్చుకున్నా.. ఆఖరి నిమిషంలో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కరువు తీరేలా లేదు.

Image result for chandra babu

ఈ వ్యవహారంలో ఒంగోలు ఎంపీ టికెట్ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిపాదన ఆసక్తిదాయకంగా మారింది. ఒంగోలు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనేది మిస్టరీగా మారింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని బతిమలాడారు. ఆయనేమో వైసీపీ వైపు వెళ్లిపోయినట్టే! ఇక బీద మస్తాన్ రావును తెచ్చి పోటీచేయమని అంటే.. ఆయన కావలి విడిచి వచ్చే ప్రసక్తి లేదని అంటున్నారట. ఇక చేసేది లేక చంద్రబాబు నాయుడు ఇప్పుడు శిద్ధా రాఘవరావు మీద కాన్సన్ ట్రేట్ చేసినట్టుగా సమాచారం. దర్శి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయనను ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని అనుకుంటున్నారట చంద్రబాబు. అందుకోసం శిద్ధా మీద చంద్రబాబు నాయుడు ఒత్తిడి తీసుకు వస్తున్నారట.

Image result for chandra babu

అయితే తను ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా లేనట్టుగా శిద్ధా రాఘవరావు తేల్చిచెప్పారట. అయినా ఇప్పుడు మరో మార్గంలేదని.. ఒంగోలు ఎంపీగా పోటీచేయాలని ఆయన మీద బాబు ఒత్తిడి చేస్తున్నట్టుగా సమాచారం. ఇక చేసేది లేక అనుచవర్గంతో సమావేశం జరుపుతున్నారట శిద్ధా. వారేమో.. దర్శిని వీడొద్దు.. ఒంగోలు ఎంపీ సీటు టీడీపీ నెగ్గే ఛాన్సేలేదు అని తేల్చి చెబుతున్నట్టుగా సమాచారం. మొత్తానికి ఆఖరి నిమిషంలో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలతో టీడీపీలో విస్మయమే వ్యక్తం అవుతోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: