ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ కాంగ్రెస్ ఎంపీ. రాజకీయ మేధావిగా గుర్తింపు పొందాడు. రాజకీయ విశ్లేషణలు చేయడంలో మంచి దిట్ట. అయితే బీజేపీని బూచిగా చూపి, జగన్ ను బద్నామ్ చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఎత్తులు పారవని అన్నారు. పైపెచ్చు అది జగన్ కే లబ్ది చేకూర్చేలా పరిణామాలు మారుతున్నాయన్నారు. "బీజేపీపై కాంగ్రెస్ కు ఉన్నంత వ్యతిరేకత ప్రజల్లో లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ లేనే లేదు. అలాంటి పార్టీతో జగన్ సంబంధం పెట్టుకున్నారని అనడం అర్థంలేని వాదన.

Image result for undavalli arun kumar

ఒకవేళ పెట్టుకున్నా ఆ ప్రభావం ఎన్నికలపై అస్సలు ఉండదు. బీజేపీ అనే బూచిని చూపించి జగన్ పై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, చంద్రబాబు లబ్దిపొందాలని చూస్తున్నారు. ఆయనకు ఆ లబ్దిచేకూరదు."తన రాజకీయ అనుభవం ప్రకారం, చంద్రబాబు ఎత్తుకున్న ఈ "బీజేపీ బూచి" అనే అస్త్రం పనిచేయదని ఉండవల్లి భావించారు. మరీ ముఖ్యంగా జగన్ వైపు పాదయాత్ర అనే అతిపెద్ద ప్లస్ పాయింట్ ఉందని, దానిముందు టీడీపీ వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా పారవని అన్నారు.

Image result for undavalli arun kumar

 "నేను చూసిన, విన్న పాదయాత్రల్లో జగన్ పాదయాత్రకు వచ్చినంత రెస్పాన్స్ నేనెక్కడా చూడలేదు, వినలేదు. ఇంతమంది జనం రావడం, ఇన్ని పబ్లిక్ మీటింగ్స్ లో మాట్లాడ్డం గ్రేట్. నిజంగా జగన్ పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. ఈ పాదయాత్ర ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా ఉంటుంది." అదే సమయంలో చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దని జగన్ కు సూచిస్తున్నారు ఉండవల్లి. ఆఖరి నిమిషంలో ప్లాన్ మొత్తం మార్చేయగల బుర్ర చంద్రబాబు సొంతమన్న ఉండవల్లి, 2014 ఎన్నికల నాటి ట్రెండ్స్ ను గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: