చంద్రబాబుకు అవతలి వ్యక్తి బలైనా పర్వాలేదు. కానీ తనకు రాజకీయ లబ్ది మాత్రం చేకూరాలి. రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ సీటు అభ్యర్థిత్వం విషయంలో బాలయ్య అల్లుడు భరత్ పేరును పరిగణనలోకి తీసుకొంటూ ఉన్నారట చంద్రబాబు నాయుడు. ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒక డమ్మీ అభ్యర్థి కావాలనే ప్రచారం సాగుతూ ఉన్న నేపథ్యంలో అనూహ్యంగా భరత్ పేరును తెరమీదకు తీసురావడం విశేషం.

Image result for chandrababu

తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి భరత్ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అయితే అది రాజమండ్రి నుంచి కాదు.. విశాఖ నుంచి. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని! విశాఖ నుంచి పోటీ చేయడానికి భరత్ ఉత్సాహంగా ఉన్నారట. తన పేరును చంద్రబాబు వద్ద ప్రస్తావించాలని.. దానికోసం ఎమ్మెల్యేలకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట భరత్. అయితే లోకేష్ పేరు చెప్పి.. ఆ ప్రాంతంలో భరత్ పోటీ చేస్తే బావుండదని పక్కన పెట్టేశారు.

ఆ డమ్మీ అభ్యర్థి బాలయ్య అల్లుడా!

రాజమండ్రి ఎంపీ సీటు విషయంలో మాత్రం అభ్యర్థిత్వానికి భరత్ పేరును పరిశీలిస్తున్నారట. అక్కడ జనసేన  అభ్యర్థి ఆకుల గెలుపుకు తెలుగుదేశం పార్టీ గట్టిగా సహకరించనున్నదని ప్రచారం జరుగుతూ ఉంది. అందుకే అంతగా ప్రభావం చూపలేని.. కచ్చితంగా ఓడిపోతాడు.. అనే అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి అవసరం అట. అందుకే మురళీ మోహన్ కూడా తప్పుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో.. భరత్ పేరును పరిశీలిస్తూ ఉన్నారట. మొత్తానికి నందమూరి కుటుంబమే కాదు, నందమూరి ఇంటి అల్లుళ్లు కూడా.. బాబుకు భలే ఉపయోగపడేలా ఉన్నారే!

మరింత సమాచారం తెలుసుకోండి: