ఏపీలో రాజకీయం అమరావతి చుట్టూ తిరగడంలేదు. అధికార పార్టీ, ప్రతిపక్ష నాయకుడు పుట్టిన రాయలసీమలోనూ వేడి లేదు. అసలు రాజకీయం అంతా ఎక్కడ ఉంది అంటే సమాధానం సులువే. అయితే ఎందుకు అలా ప్రధాన పార్టీలు చేస్తున్నాయన్నది ఇపుడు కీకలమైన ప్రశ్న. దీని వెనకాల మతలబు ఏంటన్నది కూడా చూడాలి.


ఏపీలో చూసుకుంటే ఈసారి ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలు రాజకీయంగా ఈసారి  కీలక‌మైన పాత్ర పోషించనున్నాయా అన్నది అనుమానంగా ఉంది. సీమ ఓటర్లు చాలా వరకూ బయటకు తెలిసిపోతారు రాజధాని ప్రాంతంలో కూడా పరిస్థితి నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుంది. ఇక గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర మాత్రం ఎపుడూ  మార్పు వైపు ఉంటాయి. అందుకే ఈ వైపుగా రాజకీయం కదులుతోందని అంటున్నారు. రెండు ప్రధన పార్టీలు ఇపుడు విశాఖ వైపు చూడడంలోని ఆంతర్యం కూడా అదేనని అంటున్నారు.


ఓవైపు టీడీపీ భావి నాయకుడు లోకెష్, మరో వైపు జనసేనాని పవన్ కళ్యాణ్, ఇంకోవైపు సీబీఐ మాజీ జేడీ, మరో వైపు వంగవీటి రంగా కుమారుడు రాధా ఇలా అంతా కట్టకట్టుకుని ఉత్తరాంధ్రాకే వచ్చెస్తున్నారు. దానికి కారణం ఏంటన్నది అంతుపట్టడంలేదు. అయితే మిగిలిన చోట్ల వ్యవహారం హోరా హోరీగా ఉంది. అందువల్లా ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయన్న సర్వేల సంకేతాలోతే నేతలు, పార్టీలు   ఈ వైపుగా కదులుతున్నాయని అంటున్నారు. 
మరో విషయం ఏంటంటే గత ఎన్నికల్లో టీడీపీ ఈ జిల్లాల్లో స్వీప్ చేసింది. ఈసారి మార్పు బాగా కనిపిస్తోంది. . దాంతో హడలిపోతున్న అధికార పార్టీ ఓట్ల చీలిక కోసం కూడా తనదైన వ్యూహాలు, ప్రయత్నాలు మొదలెట్టిందని అంటున్నారు. అందుకే మిగతా పార్టీల పెద్దలు కూడా ఈ వైపుగా కదులుతున్నారని అంటున్నారు. చూడాలి జనం తీర్పు ఎలా ఉంటుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: