రాజకీయనాయకుల ఉపన్యాస శైలి ఒక్కొక్కరిది ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. చంద్ర బాబు నాయుడు ఉపన్యాస శైలి తీసుకున్నట్లైతే పూర్వ కాలంలో పాస్ పోర్ట్ ఇచ్చే వ్యక్తులు ఎలాగైతే మాట్లాడతారో అలా మాట్లాడతారు. ఎదో చెప్పాల్సిన విషయాన్ని ఎటువంటి హావభావాలు లేకుండా నిలబడి ఓకే టీచర్ మాదిరిగా చెబుతుంటాడు. అయితే తరువాత వచ్చిన రాజశేఖర్ .. చంద్ర బాబుకు భిన్నంగా హావభావాలతో, సెటైర్ లతో, విమర్శలతో, నవ్వుతో మాట్లాడుతుంటాడు. 

Image result for jagan samara sankharavam

ఇక కేసీఆర్ గురించి తీసుకున్నట్లతే తన స్పీచ్ లో అవతలి వారిని తిడుతూ, హావభావాలతో ఎదుటివారిని ఇబ్బంది పెట్టె విధంగా మాట్లాడతాడు. అలాగే ఇప్పుడు వచ్చిన జగన్ తన తండ్రి స్పీచ్ తో పాటు తనదైన శైలితో స్పీచ్ ఇస్తుంటాడు. అయితే ఎప్పుడు కూడా బహిరంగసభల్లో ఓక్ స్టేజి ఉంటుంది. అక్కడికి వచ్చి అధినేతలు వచ్చి మాట్లాడి వెళ్లి పోతుంటారు. కానీ ఇప్పుడు జగన్ భహిరంగ సభల్లో ఒక కొత్త ఒరవడికి తేరలేపాడని చెప్పొచ్చు. 

Image result for jagan samara sankharavam

జనాల మధ్యలో ఒక ర్యాంప్ మాదిరిగా ఒక స్టేజి ఉంటుంది. జగన్ ఆ స్టేజి గుండా నడుచుకుంటూ అంటే చుట్టూ పక్కల జనాలు ఉంటారు. ఈ విధమైన స్టేజి వల్ల జనాలతో ఎక్కువగా కలిసిపోవచ్చు. వారిని కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ చేయొచ్చు. పైగా జనాల నుంచి కొన్ని ప్రశ్నలు ను తీసుకోని వాటికి సమాధానం చెప్పడం ద్వారా, జనాలకు ఇంకా దగ్గర అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇటువంటి విధానం మనం ఇతర దేశాల్లో గమనించవచ్చు. ఇప్పుడు జగన్ దీనిని ఇక్కడ అమలు చేయడం ద్వారా ఎంతో ఉపయోగం అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: