దేశవ్యాప్తంగా ఓట్ల పండుగ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో పార్టీలన్నీ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సిద్ధమైపోతున్నాయి. కేంద్రంలోని బీజేపీ మరింత జోరు పెంచింది. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే ప్రధాని మోదీ ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం.

Image result for modi varanasi

ప్రధాని నరేంద్ర మోడీ 2019 ఎన్నికల్లో ఎక్కడ నుంచి బరిలోకి దిగనున్నారన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 2014 ఎన్నికల్లో మోడీ.. ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి.. గుజరాత్ లోని వడోదర నుంచి పోటీ చేశారు. వడోదర లో రికార్డు స్థాయిలో ఐదు లక్షలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందినప్పటికీ.. ఆ తర్వాత ఆ సీటుకు రాజీనామా చేశారు. అత్యంత ప్రాచీన పుణ్యక్షేతం వారణాసి మీద మోడీ ప్రత్యేక దృష్టిసారించారు. 2019లో కూడా మోడీ మరోసారి వారణాసి నుంచి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. 2014లో మోడీ మీద అప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలు కూడా అభ్యర్థులను నిలిపినప్పటికీ.. ప్రధాన పోటీ మోడీ, కేజ్రీవాల్ మధ్యే నడిచింది. మోడీ 3 లక్షల 71 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Image result for modi varanasi

తాను గెలిస్తే.. వారణాసి రూపురేఖల్ని మారుస్తానంటూ... మోడీ అప్పట్లో ప్రకటించారు. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. నియోజవర్గంలో కొన్ని అభివృద్ధి పనులు పరుగులు పెట్టించారు. కొన్ని విషయాల్లో సంతోషం వ్యక్తం చేస్తున్న స్థానికులు మరికొన్ని విషయాల్లో అసంతృప్తితో ఉన్నారు. మోడీ ఈసారి వారణాసి నియోజకవర్గాన్ని మార్చుకుంటారని.. యూపీలో బీజేపీకి అంత సానుకూలపరిస్థితి లేదంటూ ఏడాది క్రితం ప్రచారం జరిగింది.  మోడీ సురక్షితమైన నియోజవర్గం కోసం వెతుకులాడుతున్నారని భారీగా ప్రచారం జరిగింది. అయితే అవన్నీ నిజాలు కాదన్న విషయం బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో తీసుకున్న నిర్ణయంతో తేటతెల్లమైపోయింది. ఏదీ ఏమైనా వారణాసిలో గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటూ మరోసారి  బరిలోకి దిగేందుకు మోడీ సిద్ధమవుతున్నారు.

Image result for modi varanasi

మోడీ వారణాసితో పాటు.. మరో హిందూ పుణ్యక్షేతమైన పూరీ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. పూరీ ఒడిశాలో ఉంది. అక్కడ నుంచి మోడీ పోటీ చేస్తే.. ఒడిశాలో కూడా పార్టీకి మద్దతు పెరుగుతుందని పార్టీ వర్గాలు భావించాయి. అయితే మోడీ రెండో స్థానం ఏదన్న విషయంపై పార్లమెంటరీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: