ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వలసలు జరగడం సహజం. ఎమ్మెల్యేలు, ఎంపీలు , ఇలా ప్రతి ఒక్కరు హడావుడి చేసి వేరే పార్టీలోకి జంప్ అవుతుంటారు. అయితే ఇప్పడు అధికార టీడీపీ పార్టీ నుంచి ప్రతి పక్ష పార్టీ అయినా వైసీపీ లోకి కట్టలు కట్టలుగా వస్తున్నారు. ఇందులో సిట్టింగులు, మాజీలు ఇలా అందరూ ఫిరాయిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి అదే విధంగా జరుగుతున్నాయి. 

Image result for pavan kalyan jansena

అయితే ఇక్కడ చాలా మందికి తమ మదిలో మెదులుతున్న ప్రశ్న. ఆంధ్ర ప్రదేశ్ లో మూడో పార్టీగా ఉన్న జనసేన లోకి ఎందుకు చేరడం లేదని. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. ఒకటి జనసేనలో పవన్ పెడుతున్న నిభందనలు , పార్టీ లోకి వస్తే రండి అంతే కానీ ఇప్పుడే ఏమి ఆశించవద్దని చెబుతున్నారంట. ఇంకొకటి ప్రజారాజ్యం విషయం లో ఇలాగే వలసలను ప్రోత్సహించి వారే పార్టీ ని నాశనం చేశారని పవన్ నమ్ముతున్నాడు. 

Image result for pavan kalyan jansena

ప్రజారాజ్యం లో గెలిచిన ఎమ్మెల్యేలు చిరంజీవి మీద ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ లో కలిపేసేటట్లు చేసారని పవన్ భావిస్తుండటం. అయితే హామీ పవన్ ఇవ్వకపోవటంతో పదవుల కోసమే పార్టీ మారే నాయకులూ ఇక దేనికి జనసేన లో చేరుతారు. ఇంకొకటి జనసేన పార్టీ ఇంకా క్షేత్ర స్థాయిలో బలపడకపోవటమే. ప్రజారాజ్యం పార్టీ అంత హడావుడి చేస్తేనే పట్టుమని 20 సీట్లు కూడా రాలేదు. ఇప్పుడు ప్రతి పక్ష పార్టీ గెలిచే స్థానము లో ఉంది కాబట్టి వలసలు ఆ పార్టీ వైపు ఎక్కువగా అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: