కళ్యాణ్ దుర్గం లో రాజకీయ పరిస్థితులు వేడి వాతావరణాన్ని తలపిస్తున్నాయి. టిడిపి అభ్యర్థి అయిన ఉన్నం హనుమంతరాయ చౌదరి ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2014లో ఆయనకు పోటీగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నుంచి తిప్పేస్వామి పోటీలో నిలిచి ఓడిపోయారు. ఈ సారి పార్టీ టికెట్ ను సమన్వయకర్తగా ఉన్న ఉషా శ్రీ చరణ్ కు ఇచ్చినట్లు ఆ పార్టీ అధినేత ప్రకటించారు. కానీ ఆ పార్టీ శ్రేణులలో కొంతవరకు విభేదాలున్నాయని, పార్టీలోని కార్యకర్తలకు సత్సంబంధాలు అంతగా బాగోలేవని తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితులను చాలా బలంగా ఉన్న హనుమంతరాయ పై గెలవాలంటే కష్టతరమైన విషయం. అసలే ఇది ఎన్నికల సీజన్ ఈ సమయంలో పార్టీ లో అందరిని ఏకతాటిపై తీసుకురావాల్సిన సమన్వయకర్త ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీలో కార్యకర్తలు అసహనానికి లోనవుతారు. ఇదిలా ఉంటే హనుమంతరాయ  మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళి పోతున్నారు. ఈ ప్రాంతం నుండి టిడిపి ఆరు సార్లు నెగ్గింది. హనుమంత రాయకు స్వతహాగా ప్రజల్లో లో మంచి పేరే ఉంది . ఇక టీడీపీకి ఇక్కడ మంచి పట్టు ఉందని చెప్పాలి .కాబట్టి ప్రజలు మళ్లీ  టిడిపి కే పట్టం కట్టేలా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: