ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ మొదటి జాబితా ప్రకటించింది. విశాఖ నుంచి మొత్తం పదిహేను సీట్లు ఉంటే అందులో పది మందికి సీట్లు ఇచ్చేసింది. ఇంకా అయిదు సీట్లను అట్టేబెట్టింది. అందులో మాజీ మంత్రి ఒకరు ఉన్నారు. అలాగే సీనియర్ నేతలు కూడా ఉన్నారు. వారంతా తమ జాతకం ఏంటని తెగ పరేషాన్ అవుతున్నారు. 


ఇక భీమునిపట్నం సీటును అలాగే ఉంచేశారు. ఇక్కడ నుంచి  సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావుకు ఉత్తరం సీటును ఇచ్చారు. దాంతో భీమిలీకి  ఎవరా అన్న సదేహం వస్తోంది. బలమైన నాయకుడే భీమిలీకి వస్తారని టీడీపీ చెప్పడంతో అందరిలోనూ ఉత్కంఠ పెరిగిపోతోంది. అలాగే పెందుర్తి నుంచి పోటీ చేయాలనుకున్న మాజీ మంత్రి, సీనియర్ నేత బందారు సత్యనారాయణమూర్తికి తొలి జాబితాలో ఝలక్ ఇచ్చారు. ఆయన వర్గం ఇపుడు టెన్షన్లో ఉంది.


అదే విధంగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనుకి కూడా టికెట్ లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. చోడవరం, మాడుగుల కూడా ఎటూ తేల్చలేదు. మొత్తానికి చూసుకుంటే టీడీపీ తొలిజాబితాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. మరి రెండవ జాబితా ఎలా ఉంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: