వైఎస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ సోదరుడు వైఎస్‌. వివేకానంద రెడ్డి(68) కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే కడప జిల్లాలోని పులివెందల ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. గతంలో కడప నుంచి లోక్ సభకు వివేకా ప్రాతినిథ్యం వహించారు.   కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తుంది.  ఈ సమయంలో సీనియర్ నాయకులైన  వైఎస్‌. వివేకానంద రెడ్డి వైఎస్ కుటుంబం జీర్ణించుకోలేక పోతున్నారు.  ఆయన మరణ వార్త వినగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. వైఎస్ సోదరుడిగా, జగన్ బాబాయ్ గా వివేకానందరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎంతో చురుకుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు.  ఆయనకు కుడి భుజంగా మెలిగారు. వైఎస్‌. వివేకానంద రెడ్డి మరణ వార్త విన్న వైఎస్ జగన్ శోక సంద్రంలో మునిగిపోయారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: