అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం లో ఆరుమాసాలకు ముందే ఎన్నికల హడావిడి జోరందుకుంది. టిడిపి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు తమ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని కాస్త ముందుగానే ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటున్నారు. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బరిలో ఉండగా వైయస్సార్సిపి పార్టీ నుంచి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆధిపత్య పోరు స్థిరంగా కాకుండా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. 2009 లో వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసి గెలుపొందారు. కానీ  2014లో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇరు పార్టీలు పట్టు కోసం ప్రధానంగా గ్రామాలను లక్ష్యంగా చేసుకొని ప్రచారం మొదలుపెట్టారు. అయితే జనసేన పార్టీ  విడుదల చేసిన  అభ్యర్థుల జాబితాలో ధర్మవరం నియోజకవర్గం నుంచి మధుసూదన్ రెడ్డి  బరిలో దిగుతున్నటు ఆయన ప్రకటించారు. కాబట్టి  రేసులో ఇంకో అభ్యర్థి జమ అవ్వడం మిగిలిన పార్టీలకు కాస్త చికాకు పెట్టే అంశం. మెల్ల మెల్లగా జనసేన పార్టీ కూడా తన బలాన్ని పెంచుకుంటూ ఉండడంతో ఇరు పార్టీలు లు కాస్త గాబరా పడుతున్నాయి. ఇప్పటికే ఇరు పార్టీలు గెలుపు కోసం  నియోజకవర్గంలో విస్తృతంగా గా ప్రచారంలోకి దూకాయి. ఇక మారుతున్న సమీకరణాలతో పెరుగుతున్న వలసల తో రసవత్తరంగా ఉంది ధర్మవరం రాజకీయం.



మరింత సమాచారం తెలుసుకోండి: