అనంతపూర్ జిల్లా కదిరి నియోజకవర్గం రాజకీయ పోరు వేడి గా సాగుతోంది. గత ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందిన అత్తర్ చాంద్ భాషా ఈసారి ఎన్నికల్లో ప్లేటు ఫిరాయించి టీడీపీలోకి జంప్ అయ్యారు. కాగా వైయస్సార్ పార్టీ నుంచి ఈసారి సిద్ధారెడ్డి ని నిలబెడుతున్నటు ఆ పార్టీ కార్యదర్శి మిథున్ రెడ్డి  ప్రకటించారు. పార్టీల జంపింగ్ ఎలా ఉన్నా  నియోజకవర్గపు అభివృద్ధి మాత్రం అంతంతమాత్రంగానే నీ సాగుతుంది. ఇక్కడ టిడిపి, వైఎస్ఆర్సిపి లలో ఏ పార్టీది హవా అని చెప్పుకుంటే నిజానికి  దేనికి లేదనే చెప్పవచ్చు. ఇక్కడ అధికారం పలుమార్లు చేతులు మారుతూ వస్తుంది.ఇక పోయిన ఎన్నికల ఫలితాలు చూస్కుంటే కేవలం 968 ఓట్లమెజారిటీతో వైసీపీ పార్టీ తర్పు నుంచి చాంద్ భాష గెలిచారు. కాబట్టి ఈ సారి ఎన్నికల పోరు భీకరంగా మారుతాయి అనటం లో సందేహం లేదు. సిద్ధ రెడ్డి స్వతహాగా డాక్టర్ గా ఈ ప్రాంతంలో తక్కువ ఫీజు తోనే వైద్యం అందించి ప్రజలలో మన్ననలు పొందారు. ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చిన వైఎస్సార్సీపీ పార్టీ మాత్రం వీడలేదు కాబట్టి ఈ సారి పార్టీ టికెట్ ఈయనే కే వరించింది. ఇద్దరు సమ ఉజ్జిలే కాబట్టి రాబోయే ఎన్నికలు జోరుగా సాగనున్నాయి.అయితే పదవి ఎవరికి దక్కుతుంది అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: