2014 ఎన్నికల్లో నెల్లూరు నుంచి వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. కడప తరువాత వైసీపీ కి ఈ జిల్లా మంచి కంచుకోటగా మారిపోయిందని చెప్పాలి. 2014 లో నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎంపీగా గెలుపొందాడు. అయితే ఇప్పుడు నెల్లూరు నుంచి మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఒంగోలు నుంచి మేకపాటి పోటీ చేయబోతున్నాడని మాటలు వినిపిస్తున్నాయి. 


నెల్లూరు వైసీపీ ఎంపీ మార్పు ... బెడిసికొట్టదు కదా ..!

అయితే తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు, ఒంగోలు ఎంపీ సీట్లలో ఏది ఇష్టం అయితే దాన్నుంచి పోటీ చేయాలని బాబు బంపర్ ఆఫర్లు ఇచ్చినా.. వాటిని తిరస్కరించారు మాగుంట. ఇప్పటికే మాగుంట టీడీపీ కి రాజీనామా కూడా చేశాడు. ఇక వైస్సార్సీపీ పార్టీలో చేరడమే లాంఛనమే. అయితే మాగుంట ఒంగోలు నుంచి పోటీ చేస్తాడా .. లేదా నెల్లూరు నుంచి పోటీ చేస్తాడా ఇప్పటికే సస్పెన్స్. 


నెల్లూరు వైసీపీ ఎంపీ మార్పు ... బెడిసికొట్టదు కదా ..!

నెల్లూరు, ఒంగోలు రాజకీయ పరిస్థితులు, సామాజికవర్గ సమీకరణాలు దాదాపుగా ఒకేరకంగా ఉంటాయి. నెల్లూరు నేతలే.. అటూ ఇటూ పోటీచేయడం ఇదివరకూ కూడా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో మేకపాటిని ఒంగోలు నుంచి, మాగుంటను నెల్లూరు నుంచి బరిలోకి దించనున్నారనే మాట వినిపిస్తూ ఉంది. నెల్లూరులో మేకపాటి పోటీ చేసినా , మాగుంట పోటీ చేసినా వైసీపీ కి గెలుపు ఖాయమని అక్కడ వినిపిస్తుంది. ఇక్కడ టీడీపీ చాలా బలహీనంగా కనిపిస్తుంది. సరైనా ఎంపీ అభ్యర్థి కూడా దొరకటం లేదంటే అర్ధం చేసుకోవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: