దేశంలోనే కొన్ని ప్రతిష్టాత్మకమైన ఎంపీ సీట్లలో విశాఖ ఒకటి. ఇక్కడ నుంచి ఎందరో ఉద్దండులు పోటీ చేసి గెలిచారు. అటువంటి విశాఖ సీటు ఇపుడు అన్ని పార్టీలకు పెద్ద షాక్ ఇస్తోంది. విశాఖ పార్లమెంట్ సీటు ప్రతీ పార్టీనీ వూరిస్తూనే ఉడికిస్తోంది.


ఇక్కడ నుంచి పోటీకి ప్రధాన పార్టీలకు అభ్యర్ధులే లేకుండా పోయారు. టీడీపీ విషయానికి వస్తే దివంగత ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి కుటుంబాన్ని పక్కన పెట్టి గట్టి అభ్యర్ధి కోసం వెతుకుతున్నారు. గాజువాక సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, మాజీ ఎంపీ సబ్బం హరి తో పాటు కొంతమంది తటస్తుల పేర్లు కూడా పరిసీలిస్తున్నారు. కానీ ఎవరూ డిసైడ్ కావడంలేదు.


ఇక వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ ఎంవీవీ సత్యనారాయణ పేరుని ఆరు నెలల క్రితమే అనుకుంది. కానీ టీడీపీ అభ్యర్ధి తేలితే మారుస్తారని అంటున్నారు. ఎంవీవీ బలమైన నేత కాదన్నది  ఆ పార్టీలో  ఉన్న  అభిప్రాయం.  ఇక వైసీపీ టికెట్ దాడి వీరభద్రరావు కి ఇస్తారని కూడా  అంటున్నారు. అలాగే నగరానికి చెందిన మరో పారిశ్రామికవేత్త  పేరు కూడా వినిపిస్తోంది. 
బీజేపీ విషయానికి వస్తే సిట్టింగ్ ఎంపీ హరిబాబు పోటీకి దూరం అంటున్నారు. దాంతో మళ్ళీ పురంధేశ్వరి అయినా రావాలి. లేకపోతే లోకల్ గా ఉన్న కాశీరాజుకి ఇస్తారంటున్నారు. ఇప్పటికైతే విశాఖ ఎంపీ సీటుకు ఏ పార్టీకి సరైన అభ్యర్ధి ఇంతవరకూ లేరన్నది నిజం.


మరింత సమాచారం తెలుసుకోండి: