ఒకప్పుడు బద్వేల్ నియోజవర్గం టీడీపీ కి కంచుకోట కానీ తెలుగు తమ్ముల మధ్య విభేదాలతో చేజేతులా పోగొట్టుకున్నారు. టికెట్ నాకంటే నాకు అంటూ పార్టీ లో చీలికలు ఏర్పరచుకున్నారు. ఇక్కడ టీడీపీ, వైసీపీ రెండు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ నెలకొంది. టీడీపీ తరుపున వీర రెడ్డి ఈ నియోజకవర్గం లో వరుస గా ఆరు సార్లు గెలుపొందారు. ఆ తరువాత పార్టీ లో విభేదాల వల్ల టీడీపీ పట్టు కోల్పోయింది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ  నుంచి పోటీ చేసిన జయరాములు, టీడీపీ అభ్యర్ధి విజయ జ్యోతి పై 9 వేల ఓట్ల తో గెలుపొందారు. కానీ ఆ తర్వత ఆయన వైసీపీ పార్టీ వీడి టీడీపీ లో కి జంప్ అయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి డా.వెంకట సుబ్బయ్య పోటీ చేయగా టీడీపీ నుంచి మాత్రం అభ్యర్థి నీ ఖరారు చేయలేదు. టీడీపీ నుంచి టికెట్ కోసం ఆశావాహులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఒక వైపు ప్రజా అభిమానం మూట కట్టుకున్న విజయ జ్యోతి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. మరో వైపు వైసీపీ నీ వీడి టీడీపీ లోకి వచ్చిన జయారాములు కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు.వైసీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య ప్రజలలో ఉన్నారు, ఈయనకు విజయ అవకాశాలూ ఎక్కువ. అయితే టీడీపీ అభ్యర్థి న్ ప్రకటిస్తే రాజకీయ సమీకరణాలు వేగంగా మారే కనిపిస్తుంది. చూడాలి బద్వేల్ రాజకీయాల్లో ఓటర్లు ఎవరికి ఓటేస్తారో!




మరింత సమాచారం తెలుసుకోండి: