ఎన్నో ఏళ్ళు గా టీడీపీ కి ఆసరా గా పెనుకొండ నియోజకవర్గం తల్లోగుతు వస్తుంది. టీడీపీ పార్టీ తరుపున ఇప్పట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి బి కే పార్థసారథి తిరిగి మళ్లీ పోటీ చేయబోతున్నారు.వైఎస్సార్సీపీ పార్టీ నుంచి మలగుండ్ల శంకరనారాయణ రేస్ లో నించున్నరు.ఇక్కడి రాజికియ చరిత్ర చూసుకుంటే 1994 నుంచి వరుసగా ఐదు సార్లు టీడీపీ పార్టీ ఏ అధికారాన్ని సొంతం చేసుకుంటూ వచ్చింది.1989 లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గం తొలుత కాంగ్రెస్ పార్టీ నుంచి చెన్న రెడ్డి పోటీ చేసి గెలిచారు .ఆ తరవాత పరిటాల కుటుంబం టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుస్తూ ఈ ప్రాంతాన్ని టీడీపీ కి కంచుకోట గా మార్చారు. కాబట్టి శంకర్ నారాయణ కు గెలుపు అంతా సులువు కాదు.కానీ పార్థసారథి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లో విఫలమయ్యారు అని , రైతు ల రుణ మాఫీ వాయిదా వేస్తూ ఇప్పటి కి తీర్చలేదని ప్రజలు భగ్గు మంటున్నారు.ఈ కోణం లో చూస్తే వైఎస్సార్సీపీ పార్టీ కి అవకాశం వచ్చినట్టే కనిపిస్తుంది.సరిగ్గా ఆచితూచి నిర్ణయాలను తీసుకోగలిగితే గెలుపు వరిస్తుంది .


మరింత సమాచారం తెలుసుకోండి: