కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మ‌ల్కాజ్‌గిరి ఎంపీ అభ్య‌ర్థి రేవంత్ రెడ్డి త‌న ఎన్నిక‌ల ప్ర‌చారం మొద‌లుపెట్టారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ నివాసంలో జరిగిన జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయ‌న త‌న‌దైన శైలిలో మ‌రోమారు ఘాటుగా స్పందించారు. కేసీఆర్ సీఎం అయిన వెంటనే నియంతగా మారాడని రేవంత్ మండిప‌డ్డారు. నియంతృత్వ పాలన ఎలాఉంటుందో కేసీఆర్ చూపించాడని, ప్రజలు 88 స్థానాలు టీఆర్ఎస్‌కు  ఇచ్చిన‌ప్ప‌టికీ, ఆయన మారడం లేదని మండిప‌డ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌ను గొడ్డుల్లగా చూస్తూ పక్క పార్టీ వాళ్ళను చేర్చుకుంటున్నాడ‌ని మండిప‌డ్డారు. 


రెండవ సారి సీఎం అయ్యాక కేసీఆర్ రాక్షసత్వాన్ని చూపిస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. ``నేను ఇంట్లో ఉంటే ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చి నన్ను పోటీ చేయమని అడిగారు. నేను సబితమ్మ ఇంటికి వెళ్లి అడిగిన నన్ను పోటీ చేయమని అడుగుతున్నారు, మీరే బాధ్యత తీసుకోవాలి అని అడిగితే...రేవంత్ పోటీ చెయ్. నేను చూసుకుంటా అని సబితక్క అన్నారు. కానీ... ఇప్పుడు నా బంధువులు అందరూ కేసీఆర్ పక్కన చేరారు. బంధువులు అందరూ ఒక పక్కన ఉంటే నేను పోటీ చేయడం అవసరమా అనుకున్నాను.

కానీ కేసీఆర్ లాంటి రాక్షసుని ఎదురుకోవడానికి తెప్పదు అనిపించింది`` అని తాను బ‌రిలో దిగేందుకు గ‌ల కార‌ణం వివ‌రించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను బెదిరించి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందని రేవంత్ ప్ర‌శ్నించారు. ``ప్రజలను నమ్మి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న. మల్కాజిగిరి మినీ భారత దేశం. విచక్షణతో ఆలోచించి ప్రజలు ఓటు వేయాలి. మీ ప్రాంతం నుంచి ఎలాంటి వ్యక్తి ఉండాలో ప్రజలు ఆలోచించాలి. చట్టసభల్లో మీ సమ‌స్యలు లెవనెత్తె వాళ్లకు ఓటు వేయండి.`` అని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: