పార్టీలో అంతర్గత గొడవలు, టిడిపి నుండి వైసిపిలోకి వలసల ప్రభావం చంద్రబాబునాయుడుపై తీవ్ర ప్రభావమే చూపుతున్నట్లుంది. దాని ప్రభావం ఏ స్ధాయిలో ఉందో తిరుపతి ఎన్నికల శంఖారావంలో  ప్రసంగం చూస్తేనే అర్ధమైపోతోంది. తిరుపతిలో బహిరంగసభకు పేరు ఎన్నికల శంఖారావం. కానీ ప్రసంగమంతా ప్రత్యర్ధులపై ఆరోపణలు, విమర్శలతోనే సరిపోయింది. మామూలుగా ఎన్నికల శంఖారావమంటే ఐదేళ్ళల్లో తమ ప్రభుత్వం చేసిన విషయాలను వివరిస్తారు. ఎన్నికల్లో తమను గెలిపిస్తే మళ్ళీ ఐదేళ్ళల్లో ఏం చేయబోయేది చెబుతారు. కానీ చంద్రబాబు ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అదే మరి చంద్రబాబు స్ఫెషాలిటీ.

 

తిరుపతిలో ఈరోజు మొదలైన ఎన్నికల శంఖారావంలో చంద్రబాబు సుమారు గంటపాటు మాట్లాడారు. ఆ గంటలో ప్రధానంగా మూడు అంశాలు ప్రస్తావించారు.  వైఎస్ వివేకానంద హత్య కేసులో అనుమానాలు, వైఎస్ కుటుంబంపైనే ఆరోపణలు, జగన్ అండ్ కో పై బురదచల్లటం. రెండో అంశం జగన్, మోడి, కెసియార్ బంధం గురించి. ఉందో లేదో తెలీని బంధం గురించి రోజు మీడియా సమావేశాల్లో, నేతల టెలికాన్ఫరెన్సుల్లో మాట్లాడేదే మళ్ళీ ప్రస్తావించారు.


చివర అంశం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కెసియార్ ఎన్నికల ఖర్చు క్రింద వెయ్యి కోట్లు ఇచ్చారట. ఢిల్లీలో కరెంట్ ఉంటుంది, హైదరాబాద్ లో స్విచ్ వేస్తే ఏపిలో ఫ్యాన్ తిరుగుతుందని. అంటే వైసిసి ఎన్నికల గుర్తు ఫ్యాన్ అన్నది తెలిసిందే కదా. ప్రతీ ఒక్కళ్ళూ ఎన్టీయార్ స్పూర్తితో బొబ్బిలిపులిలా మారాలట. టిడిపికి ఓట్లేయించాలని చెప్పారు. టిడిపి జిందాబాద్ అని చంద్రబాబు అన్నపుడు జనాల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. అంటే చంద్రబాబు ఎన్నికల శంఖారావం ఎంత పేలవంగా ఉందో  అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: