విశాఖ అంటే అందరికీ మక్కువ. ఎందుకంటే ఇక్కడ ఎవరినైనా ఆదరిస్తారని పేరు. అందుకే మూడు దశాబ్దాలుగా వలసలు పెరిగిపోయాయి. ఇక్కడ నుంచి ఇతర జిల్లాలకు పొట్ట కూటి కోసం జనం వలస బాట పడితే పదవుల కోసం ఇతర ప్రాంతాల నుంచి నేతలు  ఇక్కడకు వలసలు వస్తున్నారు.


విషయమేంటంటే మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖ ఎంపీ సీటుపై కన్నేశారుట. ఇది లేటేస్ట్ న్యూస్. ఆయన నిన్నటి వరకూ టీడీపీలో చేరి భీమిలీ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని వినిపించింది. మరీ టీడీపీతో  డైరెక్ట్ గా బంధం అంటే జనం ఏమంకుంటారో అని తూచ్ అనేశారు. ఇపుడు ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారని టాక్. 


విశాఖ ఎంపీ సీటు నుంచి ఆయన పోటీ చేస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ మాజీ జేడీ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయనకు విశాఖతో ఏ విధంగానూ సంబంధాలు లేవు. మరి వలస వచ్చిన నాయకులను ఈ ప్రాంతం బాగా  ఆదరిస్తుందన్న ఒకే ఒక్క భరోసాతో దిగిపోతున్నారనుకోవాలి. పైగా బలమైన కాపు సామాజికవర్గం అండగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారేమో.


అన్నట్లు ఈ మాజీ జేడీ టీడీపీ అంటూ జనసేన వైపు రావడం వెనక ఏమైనా అవగాహన ఉందా అన్నసందేహాలు  వస్తున్నాయి. అలా అయితే టీడీపీ నుంచి కూడా లోపాయికారి మద్దతు ఉంటుందని ధీమాతో పోటీకి సై అన్నారేమోనంటున్నారు. చూడాలి. ఆయన పోటీ చేస్తే విశాఖ సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: