వైసీపే శ్రీకాకుళం అభ్యర్ధుల జాబితాను జగన్ విడుదల చేశారు. ఆ జాబితాలో ముందుగా అనుకున్న వారికే టికెట్లు దక్కడం విశేషం. జగన్ ఈ విషయంలో  ఆచీ తూచీ వ్యవహరించారనిపిస్తోంది. దానికి అద్దం పట్టలాగానే జాబితా ఉంది.


శ్రీకాకుళం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఉండగా,  ఇచ్చాపురం నుంచి పిరియ సాయిరాజ్‌, పలాస- డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, టెక్కలి నుంచి పేరాడ తిలక్ పాతపట్నం నుంచి రెడ్డిశాంతి, శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆముదాలవలస నుంచి తమ్మినేని సీతారాం, ఎచ్చెర్ల నుంచి గొర్లె కిరణ్‌కుమార్‌, నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్, రాజాం నుంచి కంబాల జోగులు, పాలకొండ వీ.కళావతి ఉన్నారు. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ సీటు నుంచి దువాడ శ్రీనివాస్ పోటీ చేస్తారు. 


ఇక ఈ మధ్యన పార్టీలో చేరిన వారికి జగన్ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. జాబితాను జాగ్రత్తగా పరిశీలిస్తే గెలుపు గుర్రాలకే జగన్ పట్టం కట్టినట్లుగా తెలుస్తోంది. అనేక సామాజిక సమీకరణలను బేరీజు వేసుకున్న్ మీదటనే జగన్ ఈ జాబితాను రెడీ చేశారనుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: