అధికారం చేతిలో ఉంటే చాలు ఏదైనా చెయ్యచ్చు అనుకునే ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో నడుస్తోంది. మనమే అన్నీ , మనదే అంతా అనుకుంటూ సాగే మూర్ఖపు హిట్లర్ తరహా సాడిజాన్ని చూపిస్తోంది అధికార పార్టీ అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అధికార టీడీపీ నుంచి వైకాపా లోకి చాలామంది వలస వెళ్ళారు.


టీడీపీ ఆగడాలు తట్టుకోలేక వైకాపా నే ప్రత్యామ్న్యాయం గా చూసుకుంటూ ఉన్నవాళ్ళలో చిన్న స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే ల వరకూ ఉన్నారు. ముఖ్యంగా కులం రొచ్చు లో చంద్రబాబు ఇరుక్కున్నారు అనే వాదన గట్టిగా వినపడుతోంది. అయితే తాము అనుకుందే చట్టం తాము చేసిందే న్యాయం అన్న తరహాలో పార్టీ ని వదిలినందుకు కక్ష సాధింపు చర్యలని చాలా తీవ్రంగా చూపిస్తోంది టీడీపీ పార్టీ. ముఖ్యంగా చీరాల నియోజికవర్గం లో పోలీసులని ఇష్టా రాజ్యంగా వాడుకుంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మీదా ఆయన దగ్గర బంధువుల మీదా క్యాడర్ మీదా అన్యాయంగా అరస్ట్ లు చేయిస్తున్నారు ..



ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పే నాధుడే లేదు. అధికార పార్టీ కి పోలీసులు కొమ్ము కాస్తున్నారు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులని పావులు గా వాడుకుంటూ అర్ధం పర్ధం లేని దాడులు చేస్తూ ప్రైవేటు ప్రాపర్టీలలో సైతం దూరిపోయి అరస్ట్ లు చేస్తూ , స్టేషన్ లకి తీసుకుని వెళుతూ దారుణ అన్యాయాలు చేస్తున్నారు . పొలిటికల్ గా ఎదురుకోవడం చేతకాక , ఒక ఓడిపోయే ఎమ్మెల్యే క్యాండిడేట్ ని నిలబెట్టి అధికారం ఎలా దక్కించుకోవాలో తెలీక ఎలక్షన్ దగ్గర పడుతున్న టైం లో కక్ష సాధింపు చేస్తోంది టీడీపీ ..



ఆమంచి కృష్ణ మోహన్ కి సంబంధించిన క్యాడర్ లోని ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన కుర్రాళ్ళని అదుపులోకి తీసుకోవడం , ఆయన దగ్గర బంధువుల ప్రైవేటు ప్రాపర్టీల మీద అర్దరాత్రి దాడులు చెయ్యడం , వందలాది CRPF పోలీసులని ఎక్కడికక్కడ ఏర్పాటు చేసుకుని స్పెషల్ దాడులు చేయించడం చూస్తూ ఉంటె అధికార టీడీపీ , ముఖ్యమంత్రి చంద్రబాబు ల చేతకాని తనమే ఇదంతా అంటూ ఫైర్ అవుతున్నారు సామాన్య జనాలు.




ఎంత నెగెటివ్ ఇంపాక్ట్ సృష్టించినా అదంతా ఆమంచి కే మంచి అవుతుంది అనే మాట జనం లోంచి క్లియర్ గా వినపడుతోంది. ఎన్ని అరస్టులు చేస్తే అంత మెజారిటీ పెరుగుతుంది తప్ప తగ్గే సూచనలు లేవు అనేది లోకల్ మాజీ ఎమ్మెల్యే ఒకరు స్వయంగా ఆమంచి గురించి చెబుతోన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: