రాయలసీమలోని మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన  రాయచోటి నియోజకవర్గం ఒక కరువు గడ్డ. వర్షపాతం తక్కువగా నమోదయ్యే ఈ ప్రాంతంలో నీటి చూట్టున్నే రాజకీయాలు తిరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం రాయచోటి రాజకీయాలు రంజుగా మారాయి. మూడు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి నాలుగోసారి తన అదష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అలాగే ఒక్క ఛాన్స్ కోసం అధికార పార్టీ నేతలు ఎదురుచూస్తున్నారు. అధికార పార్టీ అయిన టీడీపీ నుంచి టికెట్ కోసం ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది జనసేన పార్టీ  రంగంలోకి దిగితే సీన్ మొత్తం మారిపోతుంది అంటున్నారు స్థానికులు. ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ యూత్ లో  పవన్ కున్న క్రేజుని క్యాష్ చేసుకుని పక్కా ప్రణాళికతో ముందుకు వెలితే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెపుతున్నారు. అయితే వైసీపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. గడిచిన మూడు ఏళ్లుగా ఈ పార్టీ అభ్యర్థియే గెలుస్తూ వస్తూన్నారు. ఈ సారి ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడలని టీడీపీ పార్టీ ఆశిస్తుంది. ఇది ఇలా ఉంటే నియోజకవర్గం పార్టీ ఇంఛార్జి రమేష్ రెడ్డి మరియు సీనియర్ నేత పాలకొల్లు రాయుడు కొడుకు ప్రసాద్ బాబు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో రాయచోటి టీడీపీ అభ్యర్థి తో సరికొత్త మలుపులు తిరగబోతుంది. ఒకవేళ టికెట్ దక్కపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగే యోచన లో పాలకొల్లు వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక నియోజకవర్గ అభివృద్ధికి వస్తే పెద్దగా మార్పేమీ లేదని చెప్పవచ్చు. ఇందుకు కారణం వైసీపీ నేత ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి అధికార పార్టీ నుంచి నిధులు ఏవి రావడంలేదని ఇక్కడి వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుతున్నారు. ఏదిఏమైనా ప్రాజెక్టుల పేరు చెప్పి నేతలు అందలం ఎక్కుతున్నారు.అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రజలను మభ్య పెడుతున్నరు. అయితే ఈ సారీీ ప్రజలు ఎవరికిి పట్టo కడతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: