ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ఎన్నికలకు వైయస్సార్ సిపి పార్టీ అన్ని విధాలుగా రెడీ అయ్యి చాలా బలంగా ముందుకు దూసుకు పోతుంది. ముఖ్యంగా అధికార పార్టీ టిడిపి కి ఊహకందని స్థాయిలో వైసీపీ పార్టీ వ్యూహాలు పన్నుతోంది. ఈ క్రమంలో తాజాగా తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గర ఇడుపులపాయ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 175 అసెంబ్లీ స్థానాలను మరియు 25 లోక్సభ స్థానాలను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. 

Image result for jagan

ఈ కార్యక్రమం అయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్ మొదట నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ స‌భ‌ను ముగించుకుని విజ‌య‌న‌గ‌రం జిల్లా డెంకాడ మండ‌లంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. అయితే, డెంకాడ మండ‌ల హెడ్‌క్వార్ట‌ర్స్ సెంట్ర్‌లో జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌కు ఆ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ప్ర‌జ‌లు భారీ స్థాయిలో చేరుకున్నారు.

Related image

జ‌గ‌న్‌ను చూసేందుకు భ‌వ‌నాల‌ను సైతం ఎక్కారు. ఆ క్ర‌మంలోనే జ‌గ‌న్ వాహ‌న శ్రేణికి ఆనుకున్న ఉన్న ఓ మూడంత‌స్తుల భ‌వ‌నం పిట్టగోడ‌పై సుమారు 20 మంది వ‌ర‌కు ఉన్నారు. పిట్ట‌గోడ‌పై బ‌రువు పెర‌గ‌డంతో ఒక్క‌సారిగా కూలింది. అదికాస్తా భ‌వ‌నం కింద ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌పై ప‌డ‌టంతో ఐదుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

Image result for jagan

గాయ‌ప‌డ్డ వారిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి త‌ర‌లించారు. వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు వారిలో ఒక‌రికి చెయ్యి విర‌గ‌గా, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జగన్ ఒక్కసారిగా చలించిపోయారట గాయాలైన వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వారికి చికిత్స చేయించమని పార్టీ నాయకులకు ఆదేశించారట.


మరింత సమాచారం తెలుసుకోండి: