గాజువాకలో కాపులతో పాటు యాదవులు కూడా బలంగా ఉన్నారు. ఆ సామాజికవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఉన్నారు ఆయన కుటుంబం కార్మిక  సంఘాల్లో  చురుకుగా  పనిచేసి పారిశ్రామిక వాడలో మంచి పేరు సంపాదించుకుంది.  దాంతో గాజువాకలో వారికి మంచి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో చివరి నిముషంలో టీడీపీ  టికెట్ తెచ్చుకుని మరీ గెలిచేసిన చరిత్ర పల్లా శ్రీనివాస్ ది. ఇపుడు కూడా ఆయనకు టికెట్  మొదట ఖరారు  చేసిన చంద్రబాబు ప్రచారం చేసుకోమన్నారు. దాంతో ప్రచార రధాలు సిధ్ధం చేసుకుని రంగంలో ఉన్న పల్లాకు మొదటి లిస్ట్ లో పేరు కనిపించలేదు. ఈ మధ్యలోనే పవన్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. దాంతో పవన్ గాజువాక పోటీ కోసం పల్లా టికెట్ ఆపేశారా అన్న అనుమానాలు ఆయన క్యాడర్ వ్యక్తం  చేస్తోంది.

విశాఖ జిల్లా రాజకీయాల్లో లోకేష్ ఎపిసోడ్ ముగిసిపోయింది. ఇపుడు పవన్ పర్వం ఎంటరైంది. గాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. దాంతో టీడీపీ అలెర్ట్ అవుతోంది.  అలెర్ట్ అవడం అంటే పవన్ని ఎదుర్కొని గట్టి పోటీ పెట్టడానికి కాదు. పవన్ కి అక్కడ గెలిచేందుకు అనువైన వాతారవణం కల్పించడానికి అంటూ టాక్ బాగా నడుస్తోంది. పవన్ గాజువాకను ఎంచుకోవడం వెనక పెద్ద కధే ఉంది. అక్కడ ఆయన సామాజికవర్గం చాలా ఎక్కువ. పైగా 2009 ఎన్నికల్లో అక్కడ ప్రజరాజ్యం గెలిచింది. దాంతో పవన్ తాను  అక్కడ పోటీ చేస్తే  ఎటువంటి పేచీ పూచీ లేకుండా నెగ్గేయవచ్చు అని ప్లాన్ చేసుకుంటున్నారు.  మరి లోపాయికారిగా టీడీపీ నుంచి సహకారం అందుతోంది అన్నట్లుగా కొన్ని సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి.

దానికి తగినట్లుగా విశాఖ వచ్చిన టీడీపీ అధినేత  చంద్రబాబు సైతం  పల్లాతో నిన్ను ఎంపీగా పంపుతామంటూ చెప్పడంతో పల్లా కంగారు పడిపోయారట. తనకు గాజువాక ఎమ్మెల్యే టికెట్  హామీ ఇచ్చి అక్కడ ప్రచారం చేసుకోమన్నారని, ఇపుడు ఇలా అంటే ఎలా అంటూ పల్లా డైరెక్ట్ గా అడిగేసినా  బాబు స్పందించకపోవడం  అనుమానాలకు దారితీస్తోంది. పవన్ కోసం అక్కడ బలమైన నేత పల్లాకు టీడీపీ చెక్ పెడుతోందని అంటున్నారు. ఇదే పరిస్థితి పెందుర్తి, భీమిలీ సీట్లలో కూడా ఉందంటున్నారు. అక్కడ కూడా పవన్ జనసేన అభ్యర్ధులు పోటీకి వీలుగా టీడీపీ లోపాయికారి సర్దుబాట్లు చేస్తోంది. అందుకే టీడీపీ లిస్ట్ లేటవుతోందని చెబుతున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒంటరి పోరేనని బయటకు చెబుతున్న టీడీపీ, జనసేనల మధ్యన రహస్య   అవగాహన ఏదో వుందని విశాఖ పెండింగ్ సీట్ల పితలాటకం చూస్తే డౌట్లు వచ్చేస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: