కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కమలాపురం ఒకటి. నియోజకవర్గం మొత్తం మీద ఒక్క మున్సిపాలిటీ కూడా లేదు కానీ కమలాపురాన్నీ మున్సిపాలిటీ చేసేందుకు కొందరు నాయకులు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కాలేదు. ఇక్కడ మొదట్నుంచే రెండు పార్టీల మధ్యే పోటీ జరుగుతూ ఉంటుంది. వారికి సీటును దొరికే దానిని బట్టి నాయకులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు. ఇక్కడి ఓటర్లు ఒకసారి ఒక పార్టీకి అవకాశం ఇస్తే ఇంకోసారి ఇంకో పార్టీకి అవకాశం ఇస్తూంటారు. నియోజకవర్గం మొత్తం మీద రాజకీయం అంతా ఇద్దరి వ్యక్తుల మధ్యనే నడుస్తూ వస్తుంది. కాంగ్రెస్ కనుమరుగు కావడంతో ఆ స్థానంలో వైసీపీ వచ్చి చేరింది. రాజకీయంగా కమలాపురానికి అంతటి ప్రాధన్యం లేదు. అయితే మైసూరా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంచి ప్రాధాన్యం ఉండేది. తరువాతి కాలంలో వీరశివారెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎంపీ పదవి రాలేదు. బీసీలు ఎక్కువుగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడు రెడ్లదే ఇక్కడ ఆధిపత్యం. మొత్తం 14 సార్లు ఎన్నికలు జరుగగా 13 సార్లు రెడ్లే గెలిచారు. వీటిలో 7 సార్లు కాంగ్రెస్ గెలిస్తే 3 సార్లు టీడీపీ గెలిచింది. అయితే 2014 లో జరిగిన ఎన్నికల్లో విజయం వైసీపీ ఖాతాలో పడింది. అప్పుడు వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పుత్తా నరసింహారెడ్డి వరుసగా మూడోసారి ఓటమి చవిచూశారు. కానీ అధికారంలో తమ పార్టీ ఉండడంతో నియోజవర్గానికి కోట్లలో నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నియోజకవర్గానికి ఏమి చేయలేకపోయారు. ఈసారి కూడా పార్టీ టికెట్ రవీంద్రనాథ్ కే వరించింది. మరి గెలుపు మాత్రం ఎవరిది అవుతుందో అనే ఆసక్తి నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: