చంద్రబాబు అంటేనే రాజకీయ గండర గండడు. పట్టపగలు చుక్కలు చూపించే నైపుణ్యం బాబు సొంతం. ఆయన రాజకీయ చాణక్యం అంతా ఇంతా కాదు. అయితే కాలం మారింది. బాబు వద్ద శిష్యరికం చేసే వారే ఇపుడు ఆయనకు ఎదురు నిలిచారు. వారు కూడా ఇపుడు నాలుగాకులు ఎక్కువే చదివారు. దాంతో బాబు గారి పాలిట్రిక్స్ అన్నీ  అవుట్ డేటెడ్ అయిపోతున్నాయి.


కేసీయార్, మోదీ అంటూ ఏడాదిగా అదే పాట. జనం విసిగిపోతున్నా బాబు వైఖరి మాత్రం మారడం లేదు. మోడీ, కేసీయార్ నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ బాబు పదే పదే అంటున్న మాటలు ఇపుడు జనం పట్టించుకోవడం లేదట. ఎందుకంటే అవి  చాలా పాతబడిపోయాయి. కాలం కూడా ముందుకు జరిగిపోయింది. కానీ చంద్రబాబు మాత్రం తన రాజకీయం కోసం వారిని వాడుకోవాలనుకుంటున్నారు. ఆరు నెలల క్రితం కేసీయర్ అన్న రిటర్న్ గిఫ్ట్ ని ఇంకా గుర్తు చేస్తీ లబ్ది పొందాలనుకుంటున్నారు. ఏపీ విషయంలో ఇప్పటికి పల్లెత్తు మాట అనని  కేసీయార్ బూచిని జనంలో చూపెడుతూ బాబు సానుభూతి పొందాలని చూస్తున్నారు.


ఇక కేంద్రంలోని మోడీ కూడా ఏపీ వచ్చినపుడెపుడో విమర్శలు చేశారు. ఆ తరువాత ఆయన అన్నదీ లేదు, జనం విన్నదీ లేదు. కానీ బాబు మోడీ నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ చెప్పుకోవడం చూస్తే ఎన్నికల్లో ఇదేనా బాబు అజెండా అనిపించక మానదు. సీఎం గా అనుభవం ఉందని విభజన ఏపీ కోసం అయిదేళ్ళ పాటు పాలించమని బాబుకు అధికారం ఇచ్చారు. తన పాలన గురించి చెప్పుకోకుండా మోడీ, కేసీయార్ అంటూ లేని శత్రువులను తెచ్చి సీన్ చూపిస్తే జనం నమ్ముతారా.
ఐనా ఏపీ జనాలకు ఇవన్నీ  అవసరం లేని విషయాలు. ఇపుడు తాను ఏం చేస్తానో, ఏం చేశానో చెప్పి ఓట్లు అడగాల్సిన బాబు ఈ పాత ఫార్ములా పట్టుకుని ముందుకు వెళ్ళడం వల్ల వచ్చేదేమీ ఉండదని అంటున్నారు. కానీ బాబు గారు మాత్రం కేసీయార్, మోడీల ఫోటోలు పెట్టుకుని సీట్లు సాధించాలనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: