శాసనసభ, పార్లమెంట్ స్థానాలకు  జనసేన పార్టీ తరపున పోటీ చేయనున్న మరికొంత మంది అభ్యర్థుల జాబితాను విడుద‌ల చేసింది. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. ఇందులో  సి.బి.ఐ. మాజీ జె.డి   వి.వి.లక్ష్మీనారాయణ విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా అవ‌కాశం క‌ల్పించ‌గా ఆయ‌న తోడ‌ల్లుడు రాజగోపాల్‌కు మ‌రో అవ‌కాశం క‌ల్పించింది. 

Image result for pawan kalyan jd lakshmi narayana

అనేక విశ్వవిద్యాలయాలకు ఉప కులపతిగా పదవి భాద్యతలు నిర్వర్తించిన జె.డి.లక్ష్మీనారాయణ తోడల్లుడు  రాజగోపాల్ గారికి జనసేన పార్టీలోని ఉన్నతమైన ఒక  కమిటీ కి ఛైర్మన్ గా నియమించనున్నట్లు  పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తొలుత రాజగోపాల్‌ను అనంతపురం నుంచి శాసనసభ స్థానం నుంచి పోటీచేయించాలని నిర్ణయించారు.అయితే ప్రాంతీయ సమీకరణాల నేపథ్యంలో రాజగోపాల్ గారిని అనంతపురం పార్లమెంటు స్థానం నుంచి పోటీచేయమని కోరగా అయన శాసనసభ స్థానాన్ని టి.సి.వరుణ్ కు కేటాయించడానికి సమ్మతించి ఆయన పార్టీ భాద్యతలు నిర్వర్తించండానికి మొగ్గు చూపారు.పార్టీకి సేవ చేయడానికి ముందుకు వచ్చిన ఆయ‌న‌కు ఓ క‌మిటీలో చోటు క‌ల్పించింది.

లోక్‌సభ అభ్యర్థి గా విశాఖపట్నం నుంచి వి.వి.లక్ష్మీనారాయణ 


శాసనసభ అభ్యర్థులు :
విశాఖపట్నం ఉత్తరం : పసుపులేటి ఉషా కిరణ్ 
విశాఖపట్నం దక్షిణం : గంపల గిరిధర్ 
విశాఖపట్నం తూర్పు  :  కోన తాతా రావు 
భీమిలి                      : పంచకర్ల సందీప్ 
అమలాపురం            :  శెట్టిబత్తుల రాజబాబు 
పెద్దాపురం                : తుమ్మల రామ స్వామి ( బాబు )
పోలవరం                  :  చిర్రి బాల రాజు  
అనంతపురం            :  టి.సి.వరుణ్


మరింత సమాచారం తెలుసుకోండి: