బీజేపీ కీల‌క క‌స‌ర‌త్తు ముగించింది. ప్ర‌స్తుతం తెలంగాణలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో పార్ల‌మెంటు బ‌రిలో నిలిచే నాయ‌కుల విష‌యంలో ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చింది. లోక్‌సభ అభ్యర్థుల జాబితాపై బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ ఇప్పటికే తమ నివేదికను అందించింది. పార్లమెంటు నియోజకవర్గాల్లో బరిలో దిగే అభ్యర్థులపై బీజేపీ పెద్ద‌లు త‌మ కసరత్తు పూర్తి చేశారు.


తెలంగాణలోని 17 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు ప్రతి పార్లమెంటరీ నియోకజవర్గం నుంచి ఆహ్వానించిన దరఖాస్తులను స్క్రూట్నీ చేసి మూడు పేర్లు షార్ట్‌లిస్ట్‌ చేసి జాతీయ నాయకత్వానికి సమర్పించింది. ఈ జాబితాను పరిశీలించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పార్లమెంటరీ బోర్డులో చర్చించారు. నేడో రేపో విడుదల చేయనున్నారు.

అభ్య‌ర్థుల పేర్లు
హైద‌రాబాద్ః అమ‌ర్‌సింగ్‌
సికింద్రాబాద్ః కిష‌న్‌రెడ్డి
మ‌ల్కాజ్‌గిరిః ఎన్ రాంచంద‌ర్‌రావు
చేవెళ్లః నంద‌కుమార్ యాద‌వ్‌
భువ‌న‌గిరిః పీవీ శ్యాంసుంద‌ర్‌రావు
న‌ల్గొండః జితేంద‌ర్ గుప్త‌
వ‌రంగ‌ల్ః చింతా సాంబ‌మూర్తి
మ‌హబూబాబాద్ః హుస్సేన్ నాయ‌క్‌
ఖ‌మ్మంః వాసుదేవ‌రావు
పెద్ద‌ప‌ల్లిః ఎస్ కుమార్‌
క‌రీంన‌గ‌ర్ః బండి సంజ‌య్‌
నిజామాబాద్ః అరవింద్‌
ఆదిలాబాద్ః సోయం బాపూరావు
మెద‌క్ః ర‌ఘునంద‌న్‌రావు
నాగ‌ర్ క‌ర్నూల్ః బంగారు శృతి
జ‌హిరాబాద్ః బాణాల ల‌క్ష్మారెడ్డి
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ః శాంత‌కుమార్  
చివ‌రి నిమిషంలో ఈ పేర్లలో స్వ‌ల్ప‌మార్పులు చోటుచేసుకునే అవ‌కాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: